రొమ్ము క్యాన్సర్ వచ్చేటప్పుడు కనపడే లక్షణాలు ఏంటో తెలుసా ?

0
238

ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అత్యంత ఆందోళనను కలిగిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రధానంగా స్త్రీలు దీని భాదితులు అయినప్పటికి పురుషులలో కూడా ఈ క్యాన్సర్ కనపడుతుంది. రొమ్ము క్యాన్సర్ రొమ్ములో పాల నాళాలలోని అంతర్భాగంలో మొదలౌతుంది. తమ్మెల వంటి లాబ్యూలలో వస్తే దానిని లాబ్యులార్ కార్సినోమా అని, గొట్టాలవంటి నాళాలలో వస్తే డక్టల్ కార్సినోమా అని అంటారు.

Brest Cancerరొమ్ము క్యాన్సర్ ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ అని రెండు రూపాలలో ఉంటుంది. ఇన్వేసివ్ అంటే క్యాన్సర్ కణాలు విచ్ఛిత్తి చెంది చుట్టుపక్కలున్న ఇతర అవయవాలకు సోకడం. నాన్ ఇన్వేసివ్ అంటే క్యాన్సర్ కణాలు విచ్ఛిత్తి చెందకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటాయి. ఈ స్థితిని ప్రీక్యాన్సర్ స్థితి అని కూడా అంటారు. అంటే కణాలు విచ్ఛిత్తి జరగనప్పటికి, భవిష్యత్తులో ఇన్వేసివ్ గా మారవచ్చు.

Brest Cancerరొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం…

 • రొమ్ములో గడ్డలు
 • ఛంకలో లేదా రొమ్ములో నొప్పి
 • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
 • ఛనుమొన మీద లేదా చుట్టు పుండు పడడం
 • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
 • ఛంకలలో వాపు
 • చన్నులనుండి ద్రవం కారడం
 • రొమ్ముపై చర్మం కమిలిపోయి ఉండడం
 • ఛనుమొన రూపంలో మార్పు, లోపలికి ముడుచుకుపోవడం
 • రొమ్ము పరిమాణం, ఆకారం మారిపోవడం
 • ఛనుమొనపైన, రొమ్ము చర్మం పైన పొలుసులుగా ఏర్పడడం.

Brest Cancerకేవలం బాహ్యలక్షణాలను బట్టి రొమ్ము క్యాన్సర్ ను నిర్ణయించలేము. వైద్యుల సూచనలు, సంప్రదింపులు, వైద్యపరీక్షలు తప్పనిసరి. వ్యాయామాలు మీ బరువును తగ్గించటమే కాదు, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది, ఇది మిమ్మల్ని వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. రెగ్యులర్ గా వ్యాయామాలు చెయ్యటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్యకరమైన శరీర బరువుతో ఉండటం పాటు, రొమ్ము కాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

SHARE