చిన్న పిల్లల్లో మైగ్రేన్ రావడానికి కారణాలు ఏమిటి

తలనొప్పి అంటే అంతే కదా అని సులువుగా తీసుకుంటారు కానీ తల ఉన్న ప్రతివారికీ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో ఒకసారి తలనొప్పి రావడం తప్పనిసరి. ఇదేదో చిన్న సమస్యే కదా అనుకుంటే పొరపాటే. మనకు అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి గానీ ఇందులో ఒకటీ రెండూ కావు దాదాపు 200పైగా తలనొప్పులు ఉంటాయి.

తలనొప్పుల కారణాలు లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు.
1) ప్రైమరీ తలనొప్పులు… ఈ తరహా తలనొప్పులు నేరుగా తలలోనే ఉద్భవిస్తాయి. ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది.
2) సెకండరీ తలనొప్పులు… ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతో వస్తుంటాయి. అంటే… తలలో గడ్డలు ఏర్పడటం, తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. కాబట్టే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.
3) క్రేనియల్‌ న్యూరాల్జియా లేదా ఫేషియల్‌ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు… (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులు.

మైగ్రేన్‌ : తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్‌ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. సాధారణంగా వచ్చే తలనొప్పులు వేరు. దూర ప్రయాణాలు చేసినప్పుడు, అలసిపోయినప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు.. వచ్చే తలనొప్పి వేరు. అది ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ.. మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు. అది ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేది కాదు. అది జీవిత కాలం మనిషిని వేధించే సమస్య.

3-Mana-Aarogyam-781అందుకే.. మైగ్రేన్ తో బాధపడేవాళ్లు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఎప్పుడూ తలను పట్టుకొని కూర్చుంటారు. ఇది టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువ. యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు నాలుగు నుంచి 72 గంటల వరకు కూడా వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం, వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ

నిజానికి మైగ్రేన్ అనేది పెద్దలకు, టీనేజ్ పిల్లలకు వచ్చే సమస్య మాత్రమే కాదు. చిన్నపిల్లల్లోనూ ఈ మధ్య మైగ్రేన్ సమస్య వస్తోంది. 5-14 ఏళ్ళ మధ్య పిల్లల్లో 15-20% వరకు తలనొప్పుల బారిన పడతారు. దీనివల్ల పిల్లలు తలనొప్పిని తట్టుకోలేక.. చదువు మీద దృష్టి పెట్టలేక నరకం అనుభవిస్తున్నారు. అసలు.. చిన్నపిల్లల్లో అంత తొందరగా.. చిన్న వయసులోనే ఎందుకు మైగ్రేన్ వస్తుంది. దానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం.

1-Mana-Aarogyam-781వంశపారపర్యంగా కొందరికి మైగ్రేన్ వస్తే.. ఇంకొందరికి.. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల వల్ల కూడా వస్తుంది. అలాగే.. పిల్లలు సరిగ్గా నిద్రపోకున్నా.. నిద్రపోయే సమయాలు మారుతున్నా.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో తలనొప్పులు అతిగా ఏడవడం, నీటి శాతం తగ్గిపోవడం, భోజనం మానేయడం, మానసిక లేదా శారీరక వత్తిడి వల్ల రావచ్చు. కనీసం 10% పిల్లల్లో ఈ మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది.

4-Mana-Aarogyam-781ఈ తలనొప్పి తలలో తీవ్రంగా గుచ్చుతున్న నొప్పిగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉండి గంటలపాటు బిడ్డకి ఇబ్బందికరం కావచ్చు. వాంతులు కూడా అవ్వవచ్చు. పదేళ్ళు దాటిన పిల్లల్లో కూడా క్లస్టర్ తలనెప్పులు రావచ్చు. ఈ రకం తలనొప్పి 7 కన్నా ఎక్కువ రోజులే ఉండవచ్చు. నెప్పి కంటి వెనక కలుగుతుంది. దాంతో కన్ను ఎర్రగా మారి, నీరు కారుతుంది. కళ్ళు, నుదురు వాస్తాయి.

7-Mana-Aarogyam-781పిల్లలకు సరైన నిద్ర ఉండాలంటే.. సెల్ ఫోన్స్, టీవీ, మ్యూజిక్ లాంటి వాటికి దూరంగా ఉంచి.. సరైన నిద్రను అందించగలిగితే.. భవిష్యత్తులో మైగ్రేన్ సమస్య వచ్చే ప్రమాదం ఉండదు. అలాగే.. మైగ్రేన్ తో బాధపడే పిల్లలు కూడా నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. పిల్లలను ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా చూసుకోవాలి. పిల్లలైనా.. పెద్దలైనా.. ఒత్తిడికి లోనయితే మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. వీలైనంత ప్రశాంతంగా పిల్లలు ఉండేలా చూసుకోవాలి. వాళ్ల మీద చదువు ఒత్తిడిని కూడా పెంచకూడదు.

ఒక్కోసారి వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల కూడా పిల్లలకు మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. అతి వేడి, తేమ, డీ హైడ్రేషన్ లాంటి వాటి వల్ల పిల్లల్లో మైగ్రేన్ వస్తుంది. ఒకవేళ వాతావరణంలో అటువంటి మార్పులు చోటు చేసుకుంటే కనుక.. పిల్లలను ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా మార్చుకోవాలి.

2-Mana-Aarogyam-781ఇక.. పిల్లలకు ఎంత మంచి పౌష్ఠికాహారం ఇస్తే.. అంత బెటర్. పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయకుండా.. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలను రోజువారి ఆహారంలో భాగం చేస్తే వాళ్లకు ఎటువంటి మైగ్రేన్ సమస్యలు రావు. ఒకవేళ ఉన్నా ఇదే ఫుడ్ హాబిట్ ను అలవాటు చేస్తే తొందరలోనే మైగ్రేన్ సమస్య నుంచి పిల్లలను తప్పించవచ్చు. అలాగే పిల్లలకు ఎక్కువగా ట్యాబ్లెట్లు వేయకూడదు. అతిగా మెడిసిన్స్ వాడినా.. అది మైగ్రేన్ కు దారితీయొచ్చు.

6-Mana-Aarogyam-781

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR