సద్గురు గారు ఆధ్యాత్మికత కి ఏమని అర్ధం చెప్పాడో తెలుసా?

భారతదేశంలో 100 మంది ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు, మతాలకు అతీతంగా అందరికి సహాయం చేసేందుకు ఈషా ఫౌండేషన్ స్థాపించిన గొప్ప వ్యక్తి, దేశ అభివృద్ధి కోసం యువత ముందుకు రావడానికి ఎన్నో పథకాలను, కార్యక్రమాలను చేపట్టి తన ప్రసంగాలతో అందరిని ఆలోచించేలా చేసే ఒపీనియన్ మేకర్, ప్రజలను ప్రభావితం చేసే భారతదేశంలో ఉన్న 50 మంది గురువులలో ఒకరు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు. మరి సద్గురు గారు ఆధ్యాత్మికత కి ఏమని అర్ధం చెప్పాడు? సద్గురు చెప్పిన 5 సూత్రాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sadhguruజీవితాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న వారి నుండే వైరాగ్యం అనే మాట వచ్చినది, వీరి మూలంగానే ప్రపంచంలో ఎంతోమందికి ఆధ్యాత్మికత అంటే ఒక విధమైన అభిప్రాయం అనేది వచ్చినది. ప్రస్తుతం మనలో చాలామంది ఆధ్యాత్మికత అంటే జీవితం అంటే అసలు ఆసక్తి లేనివారికే పరిమితం అని భావిస్తుంటారు. కానీ నిజం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నదాన్ని ప్రతిదీ కూడా తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత కి నిజమైన అర్ధం ఏంటంటే, కేవలం భౌతిక జీవితం గురించే ఆసక్తి ఉండటం కాదు, జీవితంలోని అన్ని కోణాల గురించి ఆసక్తి కనబరచడం.

sadhguruఇది ఇలా ఉంటె, మనలో కొందరు అనుకునేది ఏంటంటే, ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడంటే సరైన జీవనం ఉండకూడదు, సరిగా తినడకూడదు, బట్టలు కట్టుకోకూడదు, అణిగి పోయి ఉండాలి లేదా కనీసం ఆవిధంగా అయినా కనిపించాలి అని అనుకుంటారు. మనం సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటె అది ఆధ్యాత్మికత కాదని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడం అంత కూడా వైరాగ్య సిద్ధాంత మూలంగా వచ్చినదే. వైరాగ్యం తో ఎవరు కూడా జీవితాన్ని తెలుసుకోలేరు, పూర్తిగా ఆసక్తిని చూపించినప్పుడే మాత్రమే జీవితాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేకాని జీవితాన్ని తప్పించుకుందామనుకుంటే మీరు ఎప్పటికి ఆధ్యాత్మికతను తెలుసుకోలేరు.

sadhguruఅయితే రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు ముసలితనంతో మంచంలో ఉన్నప్పుడు అయన స్నేహితులు కొందరు వచ్చి అవసాన కాలం సమీపించింది కాబట్టి భగవంతుడిని ముక్తి కావాలని కోరుకోమనగా, అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ముక్తి నేను ఏమి చేసుకోవాలి, నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని ఉంది, నిజంగా భాగవతుడు ఉంటె ఈ అందమైన ప్రకృతితో ఉండటానికి నన్ను మళ్ళీ ఇక్కడకి పంపమని అడుగుతాను అని అన్నాడు. అంటే జీవితంలో నిమగ్నమైన వారికీ మాత్రమే జీవితం అంటే ఏంటో తెలుస్తుందని, మిగితా వారికీ తెలియదని, జీవితాన్ని ఆస్వాదించినప్పుడే నిజమైన ఆధ్యాత్మికులు అవుతారని సద్గురు వివరించాడు.

ఇక మనసు గురించి సద్గురు చెప్పిన సూత్రాలు ఏంటంటే,

1. మీరు కేవలం మీ శరీరం మీదే కృషిచేసి, దానిని స్థిరంగా కూర్చోబెట్ట గలిగితే అది సరిసోదు. మీరు మీ మనసునీ, భావోద్వేగాలనూ, శక్తినీ కూడా స్థిర పరచాలి.

2. మీలోనున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మీ మనస్సు సృష్టించిందే.

3. పరిష్కరించేందుకు అవకాశాలు కూడా లేని చిక్కుసమస్య మనసు. దానిని అర్ధం చేసుకునే ప్రయత్నం అర్ధ రహితం.

4. ప్రేమించగల, ఆదుకోగల, జీవితాన్ని అనుభూతి చెందగల మీ సామర్ధ్యం అపారం. మీకున్న పరిమితి మీ శరీరం, మనస్సులతోనే.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR