108 శక్తిపీఠాలలో ఒకటి గా చెప్పే ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటి?

శివుడుకి ఆగ్రహానికి గురైన పార్వతీదేవి ఈ ఆలయం దగ్గర ఉన్న పుష్కరణిలో ప్రాణత్యాగం చేసిందని పురాణం. ఇక్కడ పార్వతీదేవి దర్శనం కూడా అలానే ఉంటుందని చెబుతారు. ఈ ఆలయ శిల్ప సంపద కూడా ఎంతో అందంగా ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva Anger

తమిళనాడు రాష్ట్రం, తిరువారూర్ జిల్లాలో త్యాగేశ్వరస్వామి ఆలయం ఉంది. శివుడి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయం అతి ప్రాచీనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని త్యాగేశ్వరస్వామి అని, అమ్మవారిని కమలాంబదేవి అని పిలుస్తారు. ఈ ఆలయం 108 శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు.

Lord Shiva Anger

ఈ ఆలయంలో ఒక పెద్ద కొలను ఉంది. దీనినే కమలాంబ పుష్కరణి అని అంటారు. ఈ కొలను మధ్యలోనే కమలాంబదేవి గా వెలసిన పార్వతీదేవి, కుమారస్వామి ఆలయం ఉంది. ఒకసారి ఏదో ఒక కారణంతో శివుడి ఆగ్రహానికి గురైన పార్వతీదేవి, ఈ కొలనులోనే ప్రాణత్యాగం చేసిందట. ఆ దేవి అలా మునిగిపోతూ ఆమె రెండు చేతులతో శివుడికి నమస్కారం చేస్తూ నిట్టనిలువుగా మునిగిపోయిందట. అలా పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా ఉండే ఆ రెండు చేతులు ఆ ఆలయంలో భక్తులకి దర్శనమిస్తాయి.

Lord Shiva Anger

ఈ ఆలయం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 98 అడుగులతో రాజగోపురం నిర్మించబడింది. శిల్పసంపద ఎంతో అపురూపంగా మలచబడిన ఈ ఆలయంలో ఏకశిలలో తొలిచిన ఒక పెద్ద రాతి రథం ఉంది. ఇంకా గర్భగుడిలో ఉండే స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఒకే వరుసలో నవగ్రహాలు ఉండగా అవి అన్ని కూడా స్వామివారినే చూస్తునట్లుగా ఉండటం ఒక ప్రత్యేకత.

Lord Shiva Anger

ఇంకా ఈ ఆలయం మరకత శివలింగంగా ప్రసిద్ధి చెందింది. అయితే కర్ణాటక సంగీత చరిత్రలో, త్యాగయ్య, శ్యామశాస్రి, ముత్తుస్వామి దీక్షితులు ఈ ముగ్గురు వాగ్దేయకారులు కూడా ఇక్కడి నివాసులే అని చెబుతారు. అయితే త్యాగరాజుకి ఆ పేరుని ఈ ప్రాంతంలో ఉన్న త్యాగేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో పెట్టినదిగా చెబుతారు.

Lord Shiva Anger

ఇలా వెలసిన ఈ ఆలయంలో జరిగే రథోత్సవం సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR