అతి పురాతనమైన అమ్మవారి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. సముద్రతీరాన వెలసిన ఈ తల్లి భక్తులని చల్లగా చూస్తూ కోరిన కోర్కెలు నెరవేరుస్తూ ప్రసిద్ధి చెందింది. మరి ఈ అమ్మవారు ఎక్కడ వెలిశారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముంబై లో అరేబియా సముద్రపు ఒడ్డున శ్రీ మహాలక్షి ఆలయం ఉంది. మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా మహాలక్ష్మి పేరిటనే వ్యవహరించటం విశేషం. లక్ష్మీదేవి ఆలయమైనా, ఇక్కడ దేవి కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు. ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు అమ్మావారు దర్శనం ఇస్తుంటారు. ఈ ఆలయ పురాణానికి వస్తే, నాలుగు దశాబ్దాల క్రితం విదేశీయుల ఆక్రమణలకు వెరచిన స్థానికులు తమ దేవతలను కాపాడుకోగలిగిన వారు కాపాడుకున్నారు. కుదరనివారు, ఆయా దేవతలను సగౌరవంగా సముద్రం పాలు చేశారు. అలా సమద్రగర్భం లోకి చేరిన కొన్ని విగ్రహాలు కాలాంతరాన కొట్టుకువచ్చి, మళ్లీ జనం చేత పూజలందున్న గాథలూ వున్నాయి. సరిగ్గా అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒకటి శ్రీమహాలక్ష్మి ఆలయం. 1775 ప్రాంతాల్లో ముంబయి ప్రాంతంలోని ఏడు ద్వీపాలనూ బ్రిటిష్‌వారు పోర్చుగీసువారికి అప్పజెప్ప వలసివచ్చింది. సప్తద్వీపనగరంగా బొంబాయిని ఏకంగా తీర్చాలని లార్డ్ హాననీ అనే బ్రిటిష్ అధికారి ప్రయత్నిం చాడు. ఎంత శ్రమించినా, సముద్రతరంగాల ధాటికి ఆగలేక పనులన్నీ పాడయ్యేవిట. అందరికీ ఆశ్చర్యమూ, ఆందోళనా కలుగుతున్న తరుణంలో, కాంట్రాక్టర్ రామ్‌జీ శివాజీప్రభుకు, స్వప్నంలో శ్రీదేవి దర్శనమిచ్చి, తన విగ్రహం సముద్రంలో నిక్షిప్తమై వుందనీ, దాన్ని ముందు జలంలోంచి బయటికి తీస్తే పనులు నిరాటంకంగా సాగుతాయనీ చెప్పిందట. ఆ సంగతి అతను పై అధికారులకు చెబితే, నిజానిజాలు పరీక్షించగోరిన వారు, సముద్రంలో వెతకసాగారు. ఎంత వెతికినా విగ్ర హం కానరాలేదు. వారి పనులూ ప్రారంభం కావటం, ఆగి పోవటం జరుగుతూనేవున్నాయి. చివరికి కొందరు నావి కులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, మహా భయంకరంగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలోనే కృష్ణ మోరే అనే నావికునికి, దేవి మూడు శిరస్సులతో దర్శనమి చ్చింది. అందరూ తమ ప్రాణాలు కాపాడమని ప్రార్థించిన మీదట, కృష్ణమోరే వేసిన వలలో మూడు విగ్రహాలు లభించాయి. తరువాత ఆంగ్లేయులు ఆ దేవీవిగ్రహాలను ప్రతిష్ఠాపించి, ఆలయ నిర్మాణం చేయించారు. మంగళ వారాల్లో ఈ తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. నవ దంపతులు ఈ దేవి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ముంబయిలోని మహమ్మదీయులకు సైతం, ఈ దేవి పట్ల భక్తిప్రపత్తులు వుండటం మరో విశేషం.ఇక్కడ ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెబుతారు. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు ఎప్పుడు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు. ఇలా ఇక్కడ వెలసిన అమ్మావారి ఆలయానికి ముంబై చుట్టూ పక్కల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.