Home Unknown facts భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి ఎక్కవుగా వచ్చే అద్భుత ఆలయం

భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి ఎక్కవుగా వచ్చే అద్భుత ఆలయం

0

సరస్వతీదేవి కొలువై ఉన్న ప్రముఖ దేవాలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా ఈ ఆలయం విరాజిల్లుతుంది. ఒక ఎత్తైన కొండపైనా వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

saraswatideviతెలంగాణ రాష్త్రం, మెదక్ జిల్లా, వర్గల్ మండలంలో సరస్వతీదేవి కొలువై ఉన్న విద్యాధరి క్షేత్రం ఉంది. కొండపైన వెలసిన ఈ దేవాలయంలో సరస్వతి దేవి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం కూడా ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువగా భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి వస్తుంటారు.

ఈ దేవాలయంలో నిత్యం భక్తులకు ఉచితముగా అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయ ఆవరణలోనే ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ రోజు అనేకమంది విద్యార్థులు వేదాలని నేర్చుకుంటుంటారు. ఈ దేవాలయ పరిధిలో సుమారు 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించబడుతుంది.

ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనదని చెబుతారు.

ఈ వర్గల్ విద్యాధరి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా దసరా సందర్బంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.

Exit mobile version