Home Unknown facts ఈ ఆలయంలోని స్వామివారి రూపం కనబడి కనబడనట్లుగా ఉంటుంది ఎందుకు ?

ఈ ఆలయంలోని స్వామివారి రూపం కనబడి కనబడనట్లుగా ఉంటుంది ఎందుకు ?

0

శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం అంటే మన అందరికి కేరళలోని తిరువనంతపురంలో వెలసిన ఆలయం గుర్తుకువస్తుంది. ఈ ఆలయం భారీ నిధి నిక్షేపాలు కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే శ్రీ అనంతపద్మనాభస్వామి కొలువై ఉన్న మరొక అధ్బుత ఆలయం మరొకటి ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

swamyvaariఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ జిల్లాలో పద్మనాభం అనే గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. విజయనగరం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపైన ఈ స్వామి వారు కొలువై ఉన్నారు. స్వయంభువు అయినా ఈ స్వామి వేయి పడగల ఆదిశేషునిపై శ్రీ పద్మనాభుడు శంకు, చక్రాలు ధరించి, శ్రీ లక్ష్మీదేవి సమేతంగా భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయం చాలా పురాతనమైన గొప్ప మహిమ గల దివ్యక్షేత్రం. కొండపైన ఈ ఆలయాన్ని చేరటానికి 1300 మెట్లు ఎక్కి వెళ్ళాలి.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పాండవులు అరణ్యవాస సమయంలో ఈ పద్మనాభం కొండపైన కుంతీదేవితో సహా పాండవులు నివసించారని చెబుతారు. కొండ దిగువన ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయ విషయానికి వస్తే, కుంతీ దేవి తన అన్న అయినా శ్రీకృష్ణుడిని పూజించి ఇక్కడే కొలిచింది. కుంతీదేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామి కి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబు తారు. అదేవిధంగా పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థించి, తమకు కర్తవ్య బోధ చేయమని ప్రార్ధించగా అప్పుడు భగవానుడు తాను పద్మనాభుని అంశంతో కొలువై కర్తవ్య బోధ చేస్తానని, ఇక్కడ వ్యక్తావ్యక్త రూపంలో కొలువైనట్లు స్థలపురాణం చెబుతోంది.

ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలోని స్వామివారి రూపం కనబడి కనబడనట్లుగా ఉంటుంది. అంటే లీలగా మాత్రమే స్వామివారి దర్శనమవుతుంది. ఇక ఫాల్గుణ శుద్ధ ఏకాదశినాడు స్వామికి వార్షిక కళ్యాణం జరుగుతుంది. భాద్రపద శుద్ధ చతుర్థినాడు శ్రీ అనంత పద్మనాభ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా కార్తీక బహుళ అమావాస్యనాడు రాత్రి సమయంలో కొండమెట్లకు దీపోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి.

ఇలా అనంత పద్మనాభుడు కొలువ ఉన్న ఈ ఆలయానికి ఉత్సవ సమయాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version