Home Health క్వీన్ అఫ్ హెర్బ్స్ గా పిలవబడే శతావరి మూలిక!

క్వీన్ అఫ్ హెర్బ్స్ గా పిలవబడే శతావరి మూలిక!

0

ఆయుర్వేదవైద్యంలో పేర్కొన్న పురాతనమైన మూలికలలో శతావరి ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధాలలో కూడా కనిపిస్తాయి. “చరక సంహిత” మరియు “అష్టాంగ హృదయ్యం” అనే వైద్యగంథాలు రెండింటిలోను శతావరిని “ఆడ టానిక్”గా పిలవడం జరిగింది. ఆయుర్వేదంలో శతావరిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం, శతావరిని “నూరు వ్యాధుల్ని మాన్పునది” అని అంటారు.

shataavariశతావరి అంటే వంద భర్తలను కలిగి ఉన్నది అని కూడా అర్థం. కనుకనే ఇది స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తిరుగులేని మూలికగా శతావరి ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం శతావరిని ఉపయోగించడం వల్ల స్త్రీలు, పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పురుషులకు శతావరి ఎంతగానో మేలు చేస్తుంది.

శతావరిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. శతావరి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మహిళలకు పీరియడ్స్‌ సమయంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

శతావరి చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. దీని వల్ల వాత, పిత్త దోషాలు సమతుల్యం అవుతాయి. శతావరి శరీరంపై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవారు శతావరిని తీసుకోవడం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.

శతావరి శరీరంలో ఉండే అధిక నీటిని, ఇతర విషపదార్థాలను బయటికి విడుదల చేస్తుంది. తద్వారా శరీరం ఆరోగ్యాంగా కూడా తయారవుతుంది. అంతేకాకుండా, అదనపు లవణాలు మరియు నీటిని బయటకు పంపేయడం ద్వారా శతావరి మూత్రపిండాలను బాగా శుభ్రం చేస్తుంది.

శతావరి వేర్లు చక్కెరవ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన “యాంటీ-డయాబెటిక్ ఏజెంట్”. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ పరిమాణాన్ని బాగా పెంచుతుంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి బాగా సహాయం చేస్తుందీ మూలిక.

శతావరి మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, విసుగు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. శతావరిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది.

చర్మ వ్యాధి చికిత్సలో శతావరి చాలా ప్రభావకారిగా ఉంటుంది. ఆయుర్వేదలో శతావరి దీర్ఘకాలంగా వేధించే నొప్పిని, వాపుల్ని హరించే మందుగా పిలవబడుతోంది. చర్మం-సంబంధమైన దద్దుర్లు, విపరీతమైన దురద, దానికితోడు తలమీది చర్మం మీద వచ్చే సాంక్రామిక దద్దుర్లు మరియు చిన్న కురుపుల బాధ నుండి ఉపశమనం పొందటానికి శతావరి బాగా పని చేస్తుంది.

Exit mobile version