ఉప్పుతో మెరిసే చర్మం… ఇలా చేసి చూడండి!

అందంగా కనిపించాలని ఎవరికీ మాత్రం ఉండదు. అందంగా కనిపించడంలో చర్మ సంరక్షణ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే బయట ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం చర్మం పైన పేరుకుపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. దానికితోడు చర్మం నల్లగా మారుతుంది. నిర్జీవంగా, కాంతివిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. కానీ అవి మన చర్మానికి పడకపోతే సమస్యలు తగ్గడం కాదు ఇంకా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో ఉప్పు చక్కగా పనిచేస్తుందట.
  • దానికోసం సాధారణ ఉప్పు కాకుండా సముద్రపు ను తీసుకోవాలి. అంటే రాళ్ల ఉప్పు అన్నమాట. ఒక స్పూన్ రాళ్ల ఉప్పుని తీసుకొని అందులో కొద్దిగా తేనె, కొంచెం కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఇందులో రెండు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. దానికోసం నచ్చిన ఫ్లేవర్ ను ఉపయోగించవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ అందుబాటులో ఉంటే వేసుకోండి. లేకపోయినా ఫర్వాలేదు. ఇలా ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి మృదువుగా‌ మర్దనా చేయాలి కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు ప్రయత్నిస్తూ ఉంటే చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి మునుపటి రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ పదార్థాలు కూడా మేని చాయను పెంచేవే. పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తాయి.
  • ఇక ఎండాకాలంలో ఉక్కపోత, చెమట వలన చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, పింపుల్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు నియంత్రించేందుకు ఉప్పు చక్కగా ఉపయోగపడుతుంది. వేసవిలో చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఉప్పు ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను తగ్గించడంలో ఉప్పు ఎక్కువగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు టోనర్ గా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పును స్ప్రే బాటిల్ లో కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖంపై పూయాలి.
  • పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసే నీటిలో ఉప్పును కలపాలి. ఇలా చేయడం వలన అలసట తగ్గిస్తుంది. స్క్రీన్ టానింగ్ సమస్యలు ఉన్నవారు సముద్రపు ఉప్పు, రాక్ ఉప్పును వాడాలి. ఇందుకోసం ఒక టీస్పూన్ నారియల్ ఆయిల్, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని శరీరంపై రుద్ది 10 నుంచి 15 నిమిషాలు వదిలెయ్యాలి. ఇలా చేస్తే చెమట వాసన తగ్గుతుంది. మూడు టీ స్పూన్స్ తేనె, టీస్పూన్ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి.. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే రంధ్రాలను క్లీన్ చేస్తుంది.
  • అలాగే ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిలో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. చర్మం తడిగా ఉన్నప్పుడు శరీరంపై ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
  • ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి. అలాగే మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR