Shivaswarupamaina ayanavolu mallanna aalaya visheshalu

0
7214

అయినవోలు మల్లన్న స్వామిని శివస్వరూపముగా, శివుని మరో అవతారంగా చెబుతారు. ఇక్కడ వెలసిన ఈ మల్లికార్జునస్వామిని ఈ ప్రాంత ప్రజలు తమ కులదైవంగా భావిస్తారు. మరి ఈ అయినవోలు మల్లన్న ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. mallannaతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో వర్ధన్నపేట మండలం లో అయినవోలు అనే గ్రామం కలదు. ఈ గ్రామంలోనే కాకతీయ రాజులు కట్టించిన శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందినది. శివుని అంశలు కూడా కొన్ని ప్రాంతాలలో గ్రామదైవాలుగా పూజలు అందుకోవడం జరుగుతుంది. అలానే మల్లన్న అనే పేరుగల గ్రామదైవం మల్లికార్జున స్వామి అనే శివుని యొక్క అంశ అని తెలుస్తున్నది. mallannaకాకతీయుల పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయ్యన్న ఈ ఆలయాన్ని నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా అయినవోలుగా రూపాంతం చెందింది. mallannaఈ స్వామివారు యాదవుల ఆడ బిడ్డ గొల్లకేతమ్మను, లింగబలిజ వారి ఆడబిడ్డ అయినా బలిజ మేడలమ్మ దేవిని వివాహమాడారు. మల్లన్నస్వామికి కుడివైపున గొల్లకేతమ్మ, ఎడమ పక్కన బలిజమేడలమ్మ కొలువ ఉండగా, ఈ ఇరువురు దేవేరులతో, స్వామివారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. mallannaఈ దేవుడు శివస్వరూపముగా, శివుని మరో అవతారంగా చెప్పబడుచున్నది. దీనికి కారణం ముందు భాగంలో లింగ స్వరూపంలో మూలవిరాట్ మల్లన్న ఉండటం, ఈ శివలింగస్వరూపం అర్ద పానవట్టం కలిగి ఉండటం మరో విశేషం. ఒక లింగం శ్వేతవర్ణం కలిగి అర్ధపానవట్టం ఉండటం చేత ఈ ఆలయం, ఇక్కడి దైవము అయినా మల్లన్న స్వామివారు ఎంతో విశిష్టతను సంతరించుకున్నారు. ఈ లింగమునకు ప్రతి రోజు శైవాగమ పద్దతిని అనుసరించి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. mallannaఇలా వెలసిన ఈ మల్లన అని పిలువబడే మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు. mallanna