శివుడు వెలసిన ఈ శివాలయం కొండ ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య వెలసింది. ఇక్కడ కొలువై ఉన్న శివుడిని జటాశంకర అని పిలుస్తుంటారు. అయితే ఆలా శివుడిని పిలవడం వెనుక కారణం ఉంది. మరి ఆ కారణం ఏంటి? ఈ ఆలయానికి సంబంధించిన పురాణ విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని, ఇటార్సీ నుండి జబల్ పూర్ వరకు ఉన్న రైల్వెమార్గం లో పిపారియా అనే రైల్వే స్టేషన్ ఉంది. ఈ పిపారియా నుంచి దక్షిణంగా సుమారు 47 కీ.మీ. దూరంలో పంచ్ మరి ఉంది. అయితే వింధ్యపర్వత సానువులలో ఒక శాఖను సాత్పురా పర్వతశ్రేణి అంటారు. ఈ సాత్పురా పర్వత ప్రాంతంలో కొండశిఖరాల మధ్య, దట్టమైన అడవుల మధ్య ఉన్న ప్రదేశంలో సుమారు 60 చదరపు కీ.మీ. విస్తీర్ణంలో ఈ పంచ్ మరి ఉంది.
ఇక్కడ పొడుగాటి గుహలో జటాశంకర అని పిలువబడే శివాలయం ఉన్నది. ఈ గుహలోపల ఒక శివలింగముతో పాటు శివుడు పార్వతీదేవి విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. అయితే పరమశివుడు తన జటాజూటాన్ని ఇక్కడే విసర్జించాడట అందువల్ల ఈ స్వామిని జటాశంకర్ అని భక్తులు పిలుస్తారు.
గుహలోపల గడ్డకట్టుకపోయేంత చలిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పాండవుల గుహలు అనే చోట పంచపాండవులకు, ద్రౌపతి పేరున వరుసగా గుహలు ఉన్నాయి. వనవాస కాలంలో పాండవులు ఈ గుహలో నివసించారని తెలుస్తుంది. ఈ గుహలు క్రీ.శ. 6 లేక 7 శతాబ్దంలో నిర్మించబడినట్లుగా చరిత్ర కారులు నిర్ణయించారు.
బడే మహాదేవ్ అనేచోట ఒక గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గణపతిల విగ్రహమూర్తులు ఉన్నాయి. విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించవచ్చి భస్మాసురుని సంహరించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగం మీద నీరు నిరంతరం బొట్టు బొట్టుగా పై నుంచి పడుతూ ఉంటుంది. బడే మహాదేవ్ గుహ నుంచి మరికొద్ది దూరంలో ఒక సన్నని ఇరుకైన గుహలో మరో శివలింగం, గణేశ విగ్రహమూర్తి కొలువై ఉన్నారు. వీరిని గుప్తమహదేవ్ అంటారు.
చౌరాఘర్ అనేచోట ఒక కొండ శిఖరం మీద మరొక శివాలయం ఉంది. అయితే, ఈ కొండపైకి మార్గం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఈ కొండ శిఖరం చేరడానికి నిట్టనిలువుగా ఉండే సుమారు వెయ్యికి పైగా ఉండే మెట్లు ఎక్కి స్వామిని దర్శించాలి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.