పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ఇవి తప్పక పాటించాలి ?

0
592

ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి. దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతుంటాయి. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి

Filesమలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది.

piles problemపైల్స్ తగ్గాలంటే ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది. నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. వీటితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది. మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే పైల్స్ కూడా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

piles problemఅంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది.

piles problemమామిడి, నిమ్మ, బొప్పాయి, ఫిగ్, మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి. నిమ్మ, బెర్రీలు, ఆపిల్స్, టమాటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది.

piles problemప్యాకింగ్ వస్తువులకు బదులుగా, తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి బయట దొరికే తిండి తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తగ్గించడం బెటర్. మరియు రాత్రిపూట అధిక భోజనం తీసుకోవద్దు.

piles problemఈ చిట్కాలు పాటించిన తరువాత కూడా మలం వచ్చే భాగంలో కొన్ని రోజులపాటు మంట, ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.

SHARE