శివుడు ఈ ఆలయంలో ముక్తేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇక్కడ శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అయితే శ్రమని అంటే ఎవరు? ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి 12 కీ.మీ. దూరంలో ముక్తేశ్వరం అనే గ్రామంలో గౌతమి నది తీరాన వెలసిన దేవాలయమే శ్రీ క్షణముక్తేశ్వరాలయం. ఈ ఆలయంలో ధనుర్మాసం లో తిరుప్పావై ప్రవచనాలు జరుగును. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, రామాయణంలో బ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు రాముని చేతిలో మరణిస్తాడు. అప్పుడు శ్రీరామునికి బ్రహ్మహత్యాపాతకం కలుగుతుంది. దీన్ని నశింపచేసుకోవడానికి ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టలు చేసాడు. అయితే ఒకసారి శ్రీరాముడు పుష్పక విమానంలో వెళుతుండగా ఈ ముక్తేశ్వర ప్రదేశాన్ని చూస్తుండగా విమానం ఆగిపోయింది. అప్పుడు శ్రీరాముడు దిగి ఆ ప్రదేశాన్ని దర్శించగా అతనికి ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టలో దివ్య జ్యోతిర్లింగం కాంతులు విరజిమ్ముతూ కనబడింది. ఇక్కడే శ్రమని అని పేరుగల ఒక స్త్రీ ధ్యాన నిష్టలో ఉంది. శ్రీరాముడు ఆమె చెంతకు వెళ్లగా ఆమె కళ్ళు తెరచి శ్రీరాముడిని దర్శనం చేసుకుంది. ఆవిధంగా పురుషోత్తముని దర్శనం వల్ల తనకి శాపవిమోచనం జరిగిందని తెలియచేసింది. ఆ తరువాత శ్రీరాముడు పుట్టలో ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసి పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు. అపుడు శివుడు లింగం నుండి ప్రత్యేక్షమైనాడు. ఆవిధంగా శ్రమని పరమేశ్వరుడిని దర్శించి నమస్కరించి ఆ జ్యోతిర్లింగంలో ఐక్యమైంది. అప్పుడు శ్రీరాముని కోరిక మేరకు శివుడు ఇచట జ్యోతిర్లింగంగా వెలిసాడు. ఇక దర్శన భాగ్యం వల్ల క్షణంలో ముక్తి పొందిన శ్రమని వల్ల అది క్షణముక్తేశ్వరంగా కీర్తి పొందింది. ఈవిధంగా శ్రీరాముడు ముక్తేశ్వరుని ప్రతిష్ఠతో బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి పొందారు. అచట వెలసిన శివుడు ముక్తేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇలా శివుడు ఇచట జ్యోతిర్లింగంగా వెలసిన ఈ ఆలయం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ దివ్యమంగళ క్షేత్రంగా విరాజిల్లుతుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.