ఒక ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం. ఈ ఆలయంలో రాజరాజేశ్వరీ, శివుడు కొలువై ఉన్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఏవిధంగా ఇక్కడ శ్రీ చక్ర ఆకారంలో ఆలయాన్ని నిర్మించారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖ జిల్లాలోని దేవి పురంలో శ్రీ సహస్రాక్ష రాజ రాజేశ్వరి దేవి ఆలయ, ఉంది. అయితే శ్రీ చక్ర యంత్రం ఆకృతిలో నిర్మించి దేవదేవతలను ఈ ఆలయంలో ప్రతిష్టించారు. సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులు కలదని అర్ధం. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీ చక్రమేరుయంత్రం దొరికిన పర్వత ప్రాంతం ఇదే. సుమారు 250 సంవత్సరాల క్రితం ఇచట ఒక గొప్ప యజ్ఞం జరిగిన స్థలం కూడా ఇదే.
శాక్తేయ సంప్రదాయానికి చెందిన ఈ ఆలయ స్థాపనకు ఓ పవిత్ర ఆశయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీచక్రాలయ నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వేషిస్తుండగా నారపాడు శివారులో ఉన్న పుట్రోపు సోదరుల జీడిమామిడి తోట ప్రాంతంలో వీరికి అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ మూడు అడుగుల నెల తవ్వితే పంచలోహ శ్రీ చక్రం దొరుకుతుందని, యోని స్వరూప శక్తులతో ఓ కామాఖ్యా పీఠాన్ని స్థాపించి, తగిన సంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పగా, దేవి ఆదేశానుసారం స్వరంగా సుందరంగా, మూడు అంతస్థులతో విలక్షణ అవతార రూపులైన, దేవి దేవితల ఆవాసంగా నెలకొనబడింది.
ఈ ఆలయంలో శక్తి పూజల కొరకు కామాఖ్యా పీఠాన్ని, శివపూజలకొరకు కొండమీద శివాలయాన్ని నిర్మించారు. ఈ మూడు అంతస్థుల గల ఆలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంది. ఈ శ్రీచక్రాలయము 11 సంవత్సరాల పాటు నిర్మించారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ చక్ర నమూనాలలో నిర్మితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందినది. గర్భాలయంలో ప్రధానదైవంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి నల్లని కృష్ణశిలారూపవతిగా వెలుగొందుతుంది. ఈ ఆలయానికి సాక్షాత్తు పరమశివుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండటం విశేషం.
ఇక్కడి కొండపైన పంచభులింగేశ్వర స్వామి దేవాలయం, దక్షవాటిక ఉన్నాయి. అయితే దక్షినవాటిక మధ్యభాగంలో పిరమిడ్ ఆకృతిలో ఫలకం పై 360 శివలింగాలను, అగ్రభాగంలో మహాలింగాన్ని ప్రతిష్టించారు. రోజుకి ఒక్క శివలింగార్చన చొప్పున ఏడాది అంత జరిగే అర్చన మహాశివలింగార్చన అవుతుందని భక్తుల నమ్మకం. ఈ మహాలింగానికి నలువైపులా 1005 శివలింగాలు ప్రతిష్ఠమై ఉన్నాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.