పార్వతీదేవి సరస్వతీదేవిని వీణవాయిద్యంలో ఓడించి వెలిసిన ఆలయం

0
2403

మన పురాణాల్లో ఎన్నో ఇతిహాసాలు అనేవి ఉన్నవి. ఇక్కడ వెలసిన అమ్మవారు వీణవాయిద్యంలో సరస్వతిని ఓడించి వెలిసిందని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vednayaki Temple

తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా లో వేదారణ్యంలో వేదనాయక ఆలయం ఉంది. ఈ ఆలయం మన్నార్ ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పార్వతీదేవి సరస్వతీదేవిని వీణవాయిద్యంలో ఓడించి వెలిసిన ఆలయంగా ఈ దేవిని కొలుస్తారు.

Vednayaki Temple

పురాణానికి వస్తే, రామరావణ యుద్ధం అనంతరం రాక్షస మృత వీరుల ఆత్మలు పెనుభూతాలై శ్రీరాముడిని వెంటాడుతుండగా వాటిని వదిలించుకోవడానికి శ్రీరాముడు మొదట వినాయకుడిని ప్రార్ధించి పెనుభూతమును శాంతిప చేసి పక్కననున్న గ్రామంలో శివలింగాన్ని ప్రతిష్టించి మృతివీరుల ఆత్మలకు శాంతిని చేకూర్చడాని పురాణం.

Vednayaki Temple

ఈ గ్రామం పేరు రామచంద్రపురం, ఇక్కడి శివలింగం పేరు రామనాథ లింగం. చండికేశ్వర విగ్రహంతో పాటుగా చండికేశ్వరి విగ్రహం ఉన్న ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడి స్వామివారిని వేదనాయకుడని, అమ్మవారిని వేదనాయకి అని పిలుస్తారు.

Vednayaki Temple

ఇక్కడ ఉన్న వినాయకుడి ఆలయం చాలా ప్రత్యేకం. అయితే ఇక్కడి విరహట్టి వినాయకస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. గాలి, ధూళి, పిశాచాలను ప్రాలద్రోలు స్వామిగా ఈయనను పూజిస్తారు. ఇంకా ఇక్కడి వినాయకుడు వడక్కం తీర్థ వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ నాలుగు వేదాలు వచ్చి పూజలు చేసుకొని, ముఖ్య ద్వారాన్ని తీసుకొని వచ్చిన దారిని కాస్త గట్టిగ బంధించి వెళ్ళిపోయినందున ఈ స్వామిని దర్శించుటకు పక్కద్వారము నుండి ప్రవేశించి స్వామిని దర్శించాలి.

Vednayaki Temple

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పడు అధికసంఖ్యలో వచ్చి వేదనాయకుడని, వేదనాయకి, విరహట్టి వినాయకస్వామిని దర్శించి తరిస్తారు.

SHARE