కామాక్షి దీపం ఎలా పెట్టాలి ? దాని ప్రాముఖ్యత ఏంటి

జ్యోతి’ని పరబ్రహ్మ స్వరూపంగా అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానదీపం వెలిగించి తద్వారా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం.

సాజ్యం త్రివర్తి సంయుక్తం – వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం – త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి – దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ – దివ్య జ్యోతిర్నమోస్తుతే

ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలిగానీ.. ఒంటి దీపం.,రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. ‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని ఆవు నేతితోగానీ, నువ్వుల నూనెతోగానీ భక్తిగా వెలిగించాలి. మరెంతో భక్తిగా నమస్కరించాలి’ అని పై శ్లోకం అర్థం. దీపం … లక్ష్మీ స్వరూపం. దీపం ఉన్నచోట సర్వసంపదలు తాండవిస్తాయి. ఆనందాలు వెల్లివిరుస్తాయి. సుఖ, సంతోషాలు చోటు చేసు కుంటాయి. అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండలనే నియమమం పెట్టారు.

కామాక్షి దీపందీపం..  విజయానికి చిహ్నం. అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు. నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. మట్టి.., ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు. మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే  తక్కిన వెండి, ఇత్తడి, రాగి, కంచు ఇత్యాది లోహపు ప్రమిదలు.., దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కి పోతాయి. ఆ వేడిని భూమాత భరించలేదు. కనుకనే వట్టినేలపైనదీపం వెలిగించరాదు. ప్రమిదలో ప్రమిద వేసి మూడువత్తుల దీపం వెలిగించాలి. ఇది సాంప్రదాయం. దీపాల్లో కొన్ని రకాలు ఉంటాయి అందులో ఒకటి కామాక్షీ దీపం ఈ దీపం గురించి తెలుసుకుందాం..
కామాక్షి దీపంకామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కాబట్టి కామాక్షీ దీపం అంటారు.కామాక్షీ దేవి సర్వదేవతలకూ శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షీ కోవెల తెల్లవారుఝామున అన్నిదేవాలయాలకన్నా ముందే తెరువబడి. రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.
కామాక్షి దీపంకామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం. కామాక్షీదీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షీ దీపం కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపాన్ని కలిగి ఉంటుంది.
కామాక్షి దీపంకామాక్షీ దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు చూద్దాం… కామాక్షీ దీపాన్ని వెలిగించేటప్పుడు దీపపు ప్రమిదకు, కామాక్షి రూపానికి పసుపు, కుంకుమ పెట్టి పుష్పములతో అలంకరించి, అక్షతలు సమర్పించి అమ్మవారికి నమస్కరించి పూజ చేయాలి. యజ్ఞయాగాది కార్యక్రమమములందు, ప్రతిష్టలలో, గృహప్రవేశాది కార్యక్రమాల్లో ఈ కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం శ్రేష్టం.
కామాక్షి దీపంఒకే వత్తితో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. నువ్వుల నూనె, నేతితో దీపం వెలిగించవచ్చు. ఏ ఇంట్లో కామాక్షి దీపారాధన జరిగితే ఆ ఇంట్లో గజలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. రోజూ సాయం సంధ్య సమయంలో లక్ష్మీ తామర వత్తులను వాడి కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే 21 పున్నమి రోజులు అంటే 21 పౌర్ణమిలకు ఇంకా ఆ రోజున సూర్యోదయానికి ముందు కులదేవతా యంత్రాన్ని కామాక్షి దీపం కింద వుంచి ప్రాతఃకాలంలో  దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా గజలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
కామాక్షి దీపంరోజూ ఉదయం, సాయంత్రం కామాక్షి దీపాన్ని పెడుతూనే.. పౌర్ణమి రోజున మాత్రం కులదేవతా యంత్రంపై కామాక్షి దీపాన్ని వుంచి నువ్వుల నూనె, తామర వత్తులను ఉపయోగించి పూజించడం ద్వారా సకల అభీష్టాలు, భోగభాగ్యాలు చేకూరుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR