విటమిన్ కె లోపం ఉన్నపుడు శరీరంలో కనిపించే సంకేతాలు

ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనం సరిగా ఆహారపదార్థాలను తీసుకోవడం లేదు. దాని వలన అనారోగ్యం బారిన పడుతున్నాం. ఆహరం తీసుకోవడం అంటే ఏదో ఒకటి తినేయడం కాదు శరీరానికి కావాల్సిన పోషకాలను సరిపోయేలా అందించాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం హృదయ ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి విటమిన్-కె చాలా ముఖ్యం. మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ముఖ్యమైన విటమిన్ ఇది.

విటమిన్ కెవిటమిన్ కె కొవ్వులో కరిగే విటమిను. రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. విటమిన్ కె ఎముక మరియు ఇతర కణజాలములో కొన్ని జీవక్రియలకు సహకరింస్తుంది. ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. ఇది అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిన్ కె లో విటమిన్‌ కె1 , విటమిన్‌ కె2 అని రెండు రకాలు. విటమిన్‌ కె1 ని విటమిన్‌ కెజె (ఫిల్లొక్వినోన్‌) అని కూడా పులుస్తారు. విటమిన్‌ కె1 – మొక్కలలో తయారవుతుంది. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్‌ లలోను ఇది లభిస్తుంది. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్‌ కె1 ను విటమిన్‌ కె2 గా మారుస్తుంది. విటమిన్‌ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడుతుంది.

విటమిన్ కెశరీరంలో విటమిన్ కె లోపం ఉంటే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్ కె ఎలా పెరుగుతుందనే దానిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. వృద్ధులకు విటమిన్ కె లోపం ఉంటుంది. ఒక వ్యక్తికి విటమిన్ కె లోపం రావడానికి ప్రధాన కారణం వారు తినే ఆహారంలో విటమిన్ కె ఉండకపోవడమే. శరీరంలో విటమిన్ కె లోపం ఉంటె కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను తెలుసుకుందాం.

విటమిన్ కెవిటమిన్ కె సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అధిక రక్తస్రావం:

విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డకట్టడం కష్టమవుతుంది అధిక రక్తస్రావం జరుగుతుంది. ఇది తీవ్రమైన గాయంలా మారి మరణించే ప్రమాదాన్ని పెంచుతుంది. మన శరీరంలో విటమిన్ కె తీవ్రమైన లోపం ఉన్నప్పుడు మీ ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది.

విటమిన్ కెమీ శరీరంలో విటమిన్ కె లోపం ఉంటే గాయాలైనప్పుడు రక్తస్రావం తీవ్రంగా అవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ గాయాలు నయం కావడానికి చాలా సమయం పడుతుంది. కొంతమందికి తమ గోళ్ళ క్రింద చిన్నగా రక్తం గడ్డకట్టడం గమనించవచ్చు.

విటమిన్ కె లోపం ముఖ్యమైన లక్షణం చిగుళ్ళ నుంచి రక్తస్రావం. ఆస్టియోక్లైన్ అనే ప్రోటీన్‌కు విటమిన్ కె 2 కారణం. ఈ ప్రోటీన్లు ఖనిజాలు దంతాలకు సోకుతాయి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతాయి.

విటమిన్ కెఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి విటమిన్ కె అవసరం. విటమిన్ కె ఎముక మధ్య ముఖ్యమైన సంబంధం కలిగి ఉంటుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్ కె లోపం బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఇది కీళ్ళు ఎముకలలో నొప్పిని కలిగిస్తుంది.

 • సులువుగానే కమిలిన గాయాలు ఏర్పడడం
 • జీర్ణమార్గం (ఎలిమెంటరీ ట్రాక్)లో ఏ భాగం నుండైనా రక్తస్రావం
 • పాలిపోవడం మరియు బలహీనత
 • నల్లరంగు చారాలతో కూడిన మలం లేదా మలంలో రక్తం పడటం
 • మూత్రంలో రక్తం పడటం
 • ఎముక బలహీనపడటం
 • దద్దుర్లు
 • వేగవంతమైన హృదయ స్పందన

ప్రధాన కారణాలు ఏమిటి?

విటమిన్ కె లోపం ఏ వయసులోనైనా సంభవిస్తుంటుంది, అయితే విటమిన్ కె లోపం ప్రమాదానికి చిన్నపిల్లలకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది. చిన్న పిల్లల్లో విటమిన్ కె లోపం రావడానికి కారణాలు.

విటమిన్ కె

 • పోషకాహారలోపం
 • కాలేయ వ్యాధి
 • తగినంత ఆహారం తీసుకోక పోవడం
 • కొవ్వు అపశోషణం (మాలాబ్జర్పషన్)
 • అంటురోగాలకిచ్చే మందులు మరియు రక్తం గడ్డకట్టనీయని మందులు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR