దేవాలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

0
422

మనం తరచుగా శివాలయాలకు వెళ్తుంటాం. అక్కడ తెలిసి తెలియక మనం ఒక పొరపాటు చేస్తుంటాం అది లింగానికి నందికి మధ్యలో నడుస్తుంటాం. అది పొరపాటు శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

దైవ దర్శనానికిఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. తులసి దళాలతో పూజ చేసేటప్పుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచితే దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగుతుంది. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో విభచించి పూజ చేస్తే భార్యాభర్తలకు వియోగము సంభవిస్తుంది.

దైవ దర్శనానికితీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు, వివాహంలో సభలలో,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణం చేస్తే స్పర్శ దోషం ఉండదు.

ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

దైవ దర్శనానికిఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయానికి వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదాలను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

దైవ దర్శనానికిశ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐన దేవుడి అనుగ్రహం పొందవచ్చు.

దైవ దర్శనానికిస్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు. వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి\ నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

SHARE