భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న స్వర్ణదేవాలయం గురించి కొన్ని నిజాలు

0
3752

మన దేశంలో పూర్తిగా బంగారంతో నిర్మించిన దేవాలయాలు రెండు ఉన్నవి. అందులో మొదటిది స్వర్ణ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపుగా 700 కిలోల బంగారాన్ని వాడారు. మరి భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

swarna devalayamపంజాబ్ రాష్ట్రం, అమృత సర్ జిల్లాలో స్వర్ణ దేవాలయం ఉంది. మన దేశంలో చెప్పుకోదగ్గ కట్టడాలతో స్వర్ణదేవాలయం ఒకటి. సిక్కు మతస్థులకు అమృత సర్ ఒక గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే నాలుగవ శిక్కుమత గురువు రామ్ దాస్ శిక్కుమతాన్ని అభివృద్ధి పరిచేందుకు ఒక సరోవరం, దానిలో ఆలయాన్ని నిర్మించాడు. అయన తరువాత 5 వ మాత గురువు రామ్ దాస్ కుమారుడైన అర్జున గురువు ఈ ఆలయాన్ని మరింత తీర్చిదిద్దాడు. స్వర్ణమందిర ఆలయం, సరోవరం మధ్యలో ఉండగా, శిక్కుల ‘గ్రంథ సాహెబ్’ ఉన్న ఈ ఆలయానికి నాలుగువైపులా ద్వారాలున్నాయి. ఇక్కడ ఉన్న సరోవరం చుట్టూ 38 అడుగుల వెడల్పున గచ్చు చేసిన దారి అనేది ఉంది. దీనినే పరిక్రమ లేదా ప్రదక్షిణ మార్గం అని అంటారు.

swarna devalayamఈ ఆలయంలో ఒక అంతస్థులో ఒక పెద్ద హాలు ఉండగా, హాలు మధ్యభాగంలో ఆకర్షణీయంగా అలంకరించిన బంగారు సింహాసనం మీద పవిత్ర ‘గ్రంథసాహెబ్’ ఉంటుంది. అయితే చివరి గురువు అయిన గోవింద సింగ్ నిర్ణయం చేసినట్లుగా సిక్కు మతస్థులకు ఈ గ్రంథమే ఒక గురువు. ఈ పవిత్ర గ్రంథం మొత్తం 1430 పెద్ద సైజు పేజీలతో ఉంటుంది. ఇందులో ఉన్న శ్లోకాలను గానం చేయడానికి, ప్రతి శ్లోకానికి నిర్ణితమైన రాగం ఉంది.

swarna devalayamస్వర్ణదేవాలయంలోని సరస్సులో ఉన్న జలాలు సిక్కులకు పునర్జన్మ లేకుండా చేస్తాయని, పాపాలన్నీ కడిగివేస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఇక గురు గోవింద్ గారు సిక్కులందరిని ఇంటిపేరుని వదిలేసి పురుషుల పేరును సింగ్ గా, ఆడవారిని వారి పేరు చివర కౌర్ ని చేర్చుకోమని చెప్పారు.

swarna devalayamఆలయ ప్రాంగణంలోకి ప్రదక్షిణ మార్గం మీదకు అడుగుపెట్టక ముందే ఆడవారు తలనిండా వస్త్రం కప్పుకోవాలి, మగవారు కూడా ఏదైనా వస్త్రం తలమీద కప్పుకోవాలి. ఇక్కడ లంగర్ భవనం ఒకటి ఉంటుంది. ఇందులో ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సమయంలో అయినా ఉచితంగా భోజనం పెడతారు. ఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ అద్భుత ఆలయాన్ని చూడటానికి సిక్కులు కాకుండా అన్ని మతస్థుల వారు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు.

 

SHARE