Some Famous Predictions By Nostradamus That Actually Came True

మనలో చాలా మందికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటుంది. అయితే భవిష్యతులో ఎం జరగబోతుంది అనే ఆశ్చర్యకర నిజాలను కొన్ని వందల సంవత్సరాల ముందే బ్రహ్మం గారు చెప్పారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం తో పాటు ఒక ఫెంచ్ జ్యోతిష్కుడు ప్రపంచంలో జరగబోయే ఎన్నో సంఘటనలు ముందే చెప్పాడు. ఆ ఫ్రెంచ్ జ్యోతిష్కుడి పేరు నోస్ట్రాడమస్. 1555 లో ఈయన భవిష్యవాణిని ప్రచురించాడు. తన మరణం నుండి శతాబ్దాలుగా, చరిత్రలో కీలకమైన సంఘటనలను ముందే అంచనా వేసాడు. మరి నోస్ట్రాడమస్ కొన్ని వందల సంవత్సరాల ముందే చెప్పిన ఆ ఆశ్చర్యకర నిజాలు ఏంటి ? ఇంకా అయన ఆ భవిష్యవాణి లో యుగాంతం గురించి ఏమని చెప్పాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Predictions By Nostradamus

ఫ్రెంచ్ జ్యోతిష్కుడు మరియు వైద్యుడు అయినా నోస్ట్రాడమస్ డిసెంబర్ 14 , 1503 లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు మిచెల్ డి నోస్ట్రాడమస్. తన చిన్నతనం నుండే ఎంతో తెలివిగా ఉండే నోస్ట్రాడమస్ డాక్టర్ అవ్వాలనే ఆశయంతో మాంట్పెల్లియర్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అయితే అంతకుముందే ఔషధ పరిజ్ఞానం ఉన్న అయన మెడికల్ షాప్ నడిపించేవాడు. ఈ కారణంగా ఆయనను కాలేజ్ నుండి బహిష్కరించారు.

Predictions By Nostradamus

ఇక నోస్ట్రాడమస్ 1555 లో లెస్ ప్రోఫిటీస్ అనే పుస్తకాన్ని రాసాడు. ఈ పుస్తకం ఆ సంవత్సరంలో మాత్రమే ప్రింట్ అయింది. ఆ తరువాత ప్రింట్ కి నోచుకులేదు. అయితే ఇందులో అప్పటి పరిస్థితుల నుండి ప్రపంచం ఎప్పుడు అంతాకబోతుంది భవిష్యత్తులో ఎం జరగబోతుందో  అని దాదాపుగా 942 సంఘటనలు వ్రాసాడు. ఈయన చెప్పిన వాటిలో సృష్టిలో జరిగే వినాశకాలే ఎక్కువగా ఉండటం వలన అప్పటి చర్చ్ పెద్దలు ఈయనను సైతాన్ దూత గా పరిగణించారు.

ఇందులో కొన్ని ముఖ్యమైనవి, 

అడాల్ఫ్ హిట్లర్:

Predictions By Nostradamus

ఐరోపా పశ్చిమ ప్రాంతంలో ఒక బీద కుటుంబంలో జన్మించిన అతడు తన మాటలతో అందరిని ఆకట్టుకొని అతని కీర్తి తూర్పు రాజ్యం వైపు పెరుగుతుంది అని చెప్పాడు. ఇక 1789 లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం అందుకు నిదర్శనం అని  చెబుతారు. వెస్ట్ యూరప్ లో పేదకుటుంబంలో జన్మించిన హిట్లర్ తన ప్రసంగాలతో ప్రజల్లోకి వచ్చిన హిట్లర్ ఆ తరువాత పోలాండ్ ను ఆక్రమించి గొప్ప దళాన్ని ప్రారంభించాడు.

ది గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్:

Predictions By Nostradamus

ఒక చిన్నపాటి నిప్పు రవ్వ మొత్తం లండన్ నగరాన్ని భస్మం చేస్తుంది అని చెప్పాడు. అయన చెప్పినవైధంగానే 1666 సెప్టెంబర్ 2 న లండన్ లోని ఒక బేకరీలో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగి అది మెలిగే పెరిగి ఏకంగా మూడు రోజుల పాటు లండన్ నగరంలోని చాలా ప్రాంతాలను భస్మం చేసింది.

హిరోషిమా మరియు నాగసాకి:

Predictions By Nostradamus

అయన చెప్పిన దాని ప్రకారం రెండు మహా నగరాలూ అసలు లేకుండా పోతాయి, అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని చెప్పాడు. అయన చెప్పిన విధంగానే 1945 లో జపాన్ లోని హిరోషిమా మరియు నాగసాకి పైన అణుబాంబు వేశారు. ఆ తరువాత జపాన్ లో ఆహార సంక్షోభం ఏర్పడి ప్లేగు వ్యాధి ఎంతో మంది చనిపోయారు.

సెప్టెంబర్ 11, 2001 ట్విన్ టవర్స్:

Predictions By Nostradamus

ఇనుప పక్షులు ఆకాశాన్ని ఢీకొట్టి మారణ హోమాన్ని సృష్టిస్తాయని వ్రాసాడు. అతడు రాసినట్లుగానే న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాలు అయినా ట్విన్ టవర్స్ ని అల్-ఖైదా తీవ్రవాదులు విమానాలతో వాటిని ఢీకొట్టి మారణ హోమాన్ని సృష్టించాయి.

ఒసామా బిన్ లాడెన్:

Predictions By Nostradamus

ఎడారి నుండి వచ్చిన వాడు ప్రపంచంలో కొన్ని సంవత్సరాల పాటు కిరాతకాన్ని సృష్టిస్తాడని వ్రాసాడు. దీనికి నిదర్శనం అల్-ఖైదా స్థాపించి ఉగ్రవాదంతో ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్ లాడెన్ అని చెబుతారు.

అమెరికా ఆఖరి నల్లజాతీయుడు:

Predictions By Nostradamus

నోస్ట్రాడమస్ రాసిన దానిప్రకారం, అమెరికా యొక్క నల్లజాతి అధ్యక్షుడు 2016 లో ముగుస్తుంది. అతడే ఆఖరి నల్లజాతి అధ్యక్షుడు అని చెప్పాడు. అంటే 2016 లో అధ్యక్ష పదవి ముగిసిన ఒబామా ఏ అమెరికా చిట్టా చివరి నల్లజాతి అధ్యక్షుడు.

 2018 లో ఎం జరుగుతాయని వ్రాసాడంటే:

మౌంట్ వేసువియస్ లో భయంకర విస్ఫోటనం జరగనుంది. ఈ విస్ఫోటనం భూమిని ప్రతి 5 నిమిషాలకి ఒకసారి కంపించేలా చేస్తుంది. ఆలా కంపించినప్పుడు కొన్ని వేల మంది చనిపోతారని రాసి ఉంది. ఇంకా మనుషులు జంతువులతో మాట్లాడటమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుందని చెప్పాడు.

Predictions By Nostradamus

మూడవ ప్రపంచ యుద్దానికి మొదటి బీజం ఈ సంవత్సరంలోనే అని అతను రాసాడు. రెండు అగ్ర రాజ్యాల మధ్య మొదలైన యుద్ధం దాదాపుగా 27 సంవత్సరాల పాటు కొనసాగి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని రాసాడు. ఇక 3797 యుగాంతం ఉంటుంది అని అతడు రాసాడు.

Predictions By Nostradamus

నోస్ట్రాడమస్ ఇలా ఎన్నో విషయాలను వ్రాయగా అందులో కొన్ని మినహాయించి దాదాపు అన్ని అతడు చెప్పినట్లుగానే జరిగాయి. ఇక రాబోయే రోజుల్లో అయన రాసినవి నిజం అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనిషికి బారి ముప్పు తప్పదు అనే ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR