డార్క్ చాక్లెట్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

చాక్లెట్స్.. చిన్ననాటి నుంచి వీటితో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. కొంతమంది పిల్లలకి ఏవైనా పనులు సరిగ్గా చేయాలంటే వారికి చాక్లెట్స్ ఇస్తామంటే చాలు.. వాటిని ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే వీటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు చాలా మంది తల్లిదండ్రులు. అంతలా చిన్నపిల్లలువీటికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు.

health benefits of dark chocolateఈ అలవాటుని పిల్లల నుంచి మాన్పించేందుకు పెద్దలకు తలనొప్పి అని చెప్పొచ్చు. అంతగా చిన్నిపిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి చాక్లెట్స్టీ నేజ్ అమ్మాయిలు కూడా ఎంతో ఇష్టపడతారు. అయితే పెద్దవారు మాత్రం చాక్లెట్ తింటే ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయని అంటారు. అయితే డార్క్ చాక్లెట్ తినడం వల్ల సమస్యలతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా ఉన్నాయని గమనించాలి .

గుండెకు మంచివి :

health benefits of dark chocolateడార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని సిరలు, ధమనులు సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఫలితంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి :

health benefits of dark chocolateడార్క్ చాక్లెట్లలో కోకో సారం ఉంటుంది. ఇందులో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఈ ఫ్లేవనోల్స్ మీ అభిజ్ఞా పనితీరుకు గొప్పగా పనిచేస్తాయి.

ఆకలిని తగ్గిస్తుంది :

health benefits of dark chocolateచాక్లెట్‌ తినడం వల్ల ఆకలిని తగ్గించవచ్చు. ఆక‌లి అయిన‌ప్ప‌డు 20 నిమిషాల ముందు చాక్లెట్‌ తినడం వల్ల కొన్ని గంటల పాటు ఆకలిని నిరోధించవచ్చు. అంతేగాక మెదడులోని హర్మొన్లను ప్రేరేపిస్తుంది.

వ్యాయామంలో సహాయపడతాయి :

health benefits of dark chocolateమీ రోజువారీ వ్యాయామంలో డార్క్ చాక్లెట్లు మీకు సహాయపడతాయి. రోజుకు స‌గం చాక్లెట్ బార్ తినడం వల్ల దీంట్లోని ఎపికాటెచిన్ అనే ఫ్లేవనోల్ వ్యాయామం చేస్తున్న‌ప్పుడు మీకు సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ అదుపులో :

health benefits of dark chocolateజర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డార్క్ చాక్లెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో సహాయపడుతుంది. స్టెరాల్స్, ఫ్లేవానాల్స్‌తో పాటు కొన్ని డార్క్ చాక్లెట్ బార్‌లు తీసుకున్న వారిలో వారి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటున్నట్లు తెలిసింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR