స్టార్ ఫ్రూట్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

సహజ సిద్ధంగా ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. ఏ పండు ప్రత్యేకత దానిదే. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల మనం అన్ని రకాల పండ్లను సీజన్లకు అనుగుణంగా తినాల్సిందే. ఇక మనకు కొన్ని ప్రత్యేక పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. వాటిలో స్టార్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి. ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా ఈ పండు మనకు కనిపిస్తోంది.

health benefits with Star Fruitస్టార్ ఫ్రూట్ ను కరోంబాల అని కూడా పిలుస్తారు. పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్ మలయన్ పెనిన్సులాలో ఎక్కువగా పండిస్తారు. సౌత్ ఏసియా, ఐస్ లాండ్ మరియు చైనాలో వీటి వ్యవసాయం ఎక్కువ. అయితే ఈ ఫ్రూట్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయినది. అయితే ఇంతకీ ఈ పండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో, ఈ పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! ప్రతి పండులో సగటున 26.3 గ్రాముల కేలరీలు, 6.2 గ్రాముల కార్బోహైడ్రేట్, 2.5 గ్రాముల ఫైబర్ 3.6 గ్రా చక్కెర మరియు 0.9 గ్రా ప్రోటీన్ ఉంటుంది.

health benefits with Star Fruitకారాంబోలా పండు చాలా తక్కువ కేలరీల పండు, ఇది ఫైబర్, విటమిన్ ఎ, బి మరియు సి లతో పాటు జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, సోడియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక, ఇందులో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు, క్వెర్సెటిన్, గాలిక్ ఆమ్లం మరియు ఎపికాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్‌లో పీచు పుష్కలంగా వుంటుంది. ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పేగు సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.

health benefits with Star Fruitఇది విటమిన్ సి యొక్క గొప్ప మూలం. స్టార్‌ఫ్రూట్ రోజువారీ విటమిన్-సి యొక్క 52% వరకు మరియు రోజువారీ విటమిన్-బి5 అవసరంలో 4% వరకు అందిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది, స్టార్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడం మరియు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మరియు గోర్లు పెంచడానికి తోడ్పడుతుంది.

health benefits with Star Fruitఅజీర్తి వుండదు. అలాగే స్టార్ ఫ్రూట్ పైల్స్‌ను దూరం చేస్తుంది. అందుకే రాత్రి నిద్రించేందుకు ముందు రెండు ముక్కలు లేదా అరకప్పు మోతాదులో స్టార్ ఫ్రూట్‌ను తీసుకుంటే పైల్స్ సమస్య వుండదు. ఇంకా వర్షాకాలంలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవాలి.

health benefits with Star Fruit వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం స్టార్ ఫ్రూట్‌లో వుంది. స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పాలిచ్చే తల్లులు తింటే పాలు బాగా పడతాయి. కళ్ల మంటల్నీ తగ్గిస్తాయి. అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి. కోకమ్‌, పేషన్‌ పండ్ల మాదిరిగానే ఊబకాయాన్ని తగ్గించడానికీ దోహదపడుతుంది.

health benefits with Star Fruitస్టార్ ఫ్రూట్ మొత్తం తినదగిన పండు. స్టార్ ఫ్రూట్ పండిన తర్వాత బహు తీపి మరియు రుచికరఓగా ఉంటుంది. ఇది జ్యుసి, తీపి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దిన్ని జామ్ లేదా పికేల్ గా కూడా వాడుకోవచ్చు.

Health Benefits of Eating Ponnaganti curryస్టార్‌ఫ్రూట్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి – ఇది శోథ నిరోధక ప్రక్రియలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మరియు కణాల నష్టాన్ని సరిచేయడానికి సహాయపడుతుంది. పాలిఫెనాల్స్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడం ద్వారా మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా టైప్ -2 డయాబెటిస్‌ రోగులకు సహాయపడుతుంది.

గమనిక :

కారాంబోలాస్‌లో కారామ్‌బాక్సిన్ మరియు ఆక్సాలిక్ ఆమ్లం ఉన్నాయి. మూత్రపిండాల వైఫల్యం, మూత్రపిండాల రాళ్ళు లేదా కిడ్నీ డయాలసిస్ చికిత్సలో ఉన్నవారికి ఈ రెండు పదార్థాలు హానికరం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR