Some Inspiring Quotes By The Great APJ Abdul Kalam: అబ్దుల్ కలాం 1931వ సం॥ అక్టోబరు 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులాన్టిన్ అబ్దుల్ కలాం. ఇతని తల్లి ఆశీయమ్మ. ఇతని తండ్రి జైనులబ్దిన్, నిరుపేద కుటుంబం. ఇతను కలక్టరు కావాలని తండ్రి కలలు కనేవాడు. బాల్యంలోనే ఇతను వార్తాపత్రికలను అమ్మి తండ్రికి సహాయపడేవాడు.
అబ్దుల్ కలాం చెప్పిన కొన్ని అద్భుత సూక్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం.
1. మీ ప్రయత్నం లేకపోతే..
మీకు విజయం రాదు.
కానీ, మీరు ప్రయత్నిస్తే..
ఓటమి రాదు.
2. మన జననం సాధారణమైనదే కావచ్చు. కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి.
3. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు.
ఎందుకంటే.. నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే.. నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి.. చాలామంది ఎదురు చూస్తుంటారు.
4. ఇతరులను ఓడించడం సులువే..
కానీ, ఇతరులను గెలవడం కష్టం.
5. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు.. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి.. నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని.
6. కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే
7. ప్రతి టీచరు.. ఒకప్పుడు విద్యార్థే
ప్రతి విజేత.. ఒకప్పుడు ఓడినవాడే
ప్రతి నిపుణుడు.. ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది.. నేర్చుకోవడం అనే వారధినే.
8. సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెస్సేజులు మాత్రమే ఉంటాయి.. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి.. అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి.
9. క ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే.
10. అహంకారం ప్రతీ ఒక్కరినుండి నుండీ ఆఖరికి భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది, కాబట్టి అహంకారాన్ని వదిలివేయండి
11. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి
12. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది.