సిక్కిం రాష్ట్రంలో బాబా హర్భజన్ సింగ్ ఆలయం గురించి కొన్ని నిజాలు

భారతదేశానికి రక్షణగా మంచు కొండల్లో జవాన్లు వారి ప్రాణాలని పణంగా పెట్టి గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయకుండా కాపు కాస్తుంటారు. అలా కొన్ని సంవత్సరాల క్రితం ఒక సైనికుడు మంచులో ప్రమాదవశాత్తు మరణించగా ఇప్పటికి అతని ఆత్మ అక్కడే తిరుగుతుందని చెబుతున్నారు. మరి ఆ సైనికుడి ఆలయం ఎక్కడ ఉంది? అక్కడి స్థానికుల నమ్మకం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

soldier templeసిక్కిం రాష్ట్రంలో బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తులు ఒక బాటిల్ లో నీటిని తీసుకువచ్చి ఆ బాటిల్ ని ఆలయం వద్ద వదిలేసి కొన్ని రోజుల తరువాత ఆ నీటిని తీసుకువెళ్లి తీర్థంగా స్వీకరిస్తారు. ఇలా చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న బాబా గారు సెలవు తీసుకొని తన ఇంటికి వెళతారని, అప్పడు అక్కడి వారు ప్రార్థనలు చేసి పూలతో వీడ్కోలు చెబుతారని, ఒక బెర్త్ కూడా అతని పేరు మీద రిజర్వు చేసి, ఇద్దరు జవాన్లని అతనితో పంపిస్తారని, అతని తల్లికి నెల నెల కొంత జీవితాన్ని కూడా ఇస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

soldier templeఇక విషయంలోకి వెళితే, బాబా హర్భజన్ సింగ్ అనే ఒక సైనికుడు తన బెటాలియన్ లో ఉన్న కంచర గాడిదలను తీసుకొని వెళుతుండగా మంచు లో కూరుకుపోయి చనిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పుడు అతని ఆత్మ అక్కడి మిగతా సైనికులకు దారిని చూపించగా వారు అతని శరీరాన్ని కనుక్కోవడానికి మూడు రోజుల సమయం పట్టిందట. ఆ తరువాత బాబా అక్కడే ఉన్నట్లుగా అతడి ఆత్మ అక్కడే తిరుగుతున్నట్లుగా కొందరికి కనిపించడంతో, ఆ ప్రదేశంలో బాబాకి సమాధిని ఏర్పాటుచేశారు.

soldier templeఆవిధంగా బాబా కి సమాధిని ఏర్పాటుచేయగా అక్కడికి బాబా రోజు రాత్రి అక్కడికి వస్తారని, అతడి యూనిఫామ్ ధరిస్తాడని, అతని బూట్లు తెల్లవారే సమయానికి బురదతో ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఆ మధ్య జరిగిన ఇండో – చైనా యుద్దానికి మూడు రోజుల ముందే అక్కడి సైనికులను అప్రమత్తం చేసాడని వారు తెలిపారు. ఈవిధంగా  సైనికుడైన బాబా హర్భజన్ ఆత్మ ఇప్పటికి అక్కడే ఉందని, ఆ సమాధి దగ్గరికి వచ్చి బాటిల్ లో నీటిని తీసుకువచ్చి తిరిగి ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తే కోరిన కోరికలు నెరవేరుతయని అక్కడి స్థానికుల నమ్మకం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR