పూరి జగన్నాథ ఆలయం గురించి ఆశ్చర్యకర నిజాలు

పూరి జగన్నాథ రథయాత్ర కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఆలయంలో గర్భ గుడిలోని విగ్రహాలు రాతి తో చేయబడితే ఇక్కడి ఆలయంలో మాత్రం స్వామి వారి విగ్రహాలు చెక్కతో చేయబడినవి. ఇలా ఈ ఆలయంలో దాగి ఉన్న మరిన్ని ఆశ్చర్యకర విషయాల ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Puri Jagannath Templeఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరీ జగన్నాథ దేవాలయం ఉంది. ఈ ఆలయం నీలాద్రి అనే పర్వతం పైన ఉంది. ఈ ఆలయం సుమారు 4,00,000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైన ప్రకారం కలిగి ఉండి లోపల సుమారు 120 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి అతి ప్రధానమైన రెండు విశేషాలు ఉన్నాయి. మొదటిది నవ కళేబర ఉత్సవం, రెండవది ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథోత్సవం. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు చెక్కతో చేయబడినవి కనుక ఈ విగ్రహాలను దహనం చేసి కొత్తగా చేసిన విగ్రహాలను తిరిగి ప్రతిష్టిస్తారు. దీనినే నవ కళేబర ఉత్సవం అని అంటారు.

Puri Jagannath Templeఇది ఇలా ఉంటె ఈ ఆలయంలో కొన్ని అధ్బుతమైన విషయాలనేవి దాగి ఉన్నాయి. అవి ఏంటంటే,ఈ ఆలయం పై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎటు వైపు నుండి చూసినా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.

Puri Jagannath Templeవేరే ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయం పై ఉన్న  జెండా ఎప్పుడు గాలికి  వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది. దానిని దాదాపు ఇరవై లక్షలు మందికి పెట్టవచ్చును. ఐనా సరే అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు.

Puri Jagannath Templeఈ ఆలయంలోని వంటశాలలో చెక్కల నిప్పు మీద ఏడు మట్టి పాత్రలను ఒక దానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది. ఇంకా ఈ ఆలయ సింహ ద్వారంలోనికి ఒక అడుగు వేయ్యగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక్క అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.

Puri Jagannath Templeసాధారణంగా సముద్రం మీద నుంచి భూమికి మీదకు గాలి వస్తుంది మరియు సాయంత్రం వేళలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఇక్కడ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

ఇలా ఇవన్నీ కూడా పూరి లో ఉండే కొన్ని అధ్బుత విషయాలని చెప్పుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR