గర్భిణీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు!

వర్షాకాలం మొదలైందంటే ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేర్ తీసుకోవడం ఎంతో అవసరం. దోమల వల్ల, ఈగల వల్ల అనేక వైరస్ లు సోకుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు వర్షాకాలం సీజన్ చాలా సమస్యలు తీసుకొస్తుంది.

Monsoon Seasonగర్భం దాల్చిన మహిళలు అయితే.. వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తాయి. గర్భిణీలకు.. ఈసమయంలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గితే.. లేనిపోని వైరస్ లు అటాక్ చేస్తే.. తీవ్ర రక్త స్రావం అవుతుంది. అలాగే.. గర్భస్రావం అయ్యే చాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే.. మహిళలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Monsoon Seasonముఖ్యంగా వర్షంలో తడవకూడదు. దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి. వర్షాకాలంలో డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమల నుండి రక్షించుకునేందుకు దోమ తెర‌లు వాడుతూ ఉండాలి. అంతేకాకుండా వర్షం కురిస్తే వాతావరణం అంతా చల్లగా మారుతుంది. కాబట్టి వెచ్చని దుస్తులను ధరించాలి. ఫ్రిడ్జ్ లో ఉండే నీళ్ళను మరియు ఐస్ క్రీమ్ లను తీసుకోకపోవడం మంచిది.

Monsoon Seasonవర్షం కారణంగా ప్రతిచోటా తేమ ఉంటుంది మరియు బ్యాక్టీరియా చురుకుగా మారుతుంది. అనేక రకాల వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి, ఇది స్త్రీకి మరియు ఆమె బిడ్డకు ప్రమాదకరం. వర్షాకాలంలో గాలి తేమ కారణంగా, వర్షాల తర్వాత తేమ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది ఎక్కువ చెమటను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలలో అధిక చెమట డీహైడ్రేషన్ కి కారణమవుతుంది. అందుకే సౌకర్యవంతమైన ఫిట్టింగ్ వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.

Monsoon Seasonఅలాగే గర్భిణీ స్త్రీలు తమ ఆహారం యొక్క పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఏదైనా తినడానికి ముందు, అది శుభ్రంగా ఉందా లేదా అనే దానిపై శ్రద్ధ పెట్టాలి. అంతే కాకుండా బయట నుండి తీసుకు వచ్చిన ఆహారాన్ని అస్సలు త‌న‌కూడ‌దు. నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగడం అలవాటు చేసుకోవాలి. తమ ఇంటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బాత్రూమ్ శుభ్రం చేయడానికి నాణ్యమైన జెర్మిసైడ్ ఉపయోగించండం మంచిది.

Monsoon Seasonవర్షాకాలం మురికి నీటి నుండి వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది, కాబట్టి చేతులు, కాళ్ళను శుభ్రం చేయడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయటి నుండి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. బయటకు వెళ్ళినపుడు హ్యాండ్ శానిటైజర్‌ను దగ్గర పెట్టుకోవాలి. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళడం చేయవద్దు.

Monsoon Seasonఇక గర్భిణీలకు వర్షాకాలంలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తుంటుంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దాని వల్ల.. ఎక్కువగా ద్రవ పదార్థాలను తాగాలనే కోరిక వస్తుంటుంది. గర్భిణీలు ఎక్కువగా నీళ్లు తాగడం లేదా ఇతర జ్యూస్ లు తాగడం మంచిది. లేదంటే.. తలనొప్పి, అలసట దరిచేరే అవకాశం ఉంటుంది.

Monsoon Seasonప్రతిరోజు కాసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డకు డీ విట‌మిన్ అందుతుంది. అంతే కాకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. వైద్యుల సలహాతో మల్టీ విటమిన్ టాబ్లెట్ లు వేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్ర పోవాలి. ముఖ్యంగా బిడ్డ ఎదుగుద‌ల తల్లి తీసుకునే పోషకాహారం పై ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR