కంచిలో అమ్మవారి బీజాక్షర యంత్రం ప్రత్యేకత!!

కంచి కామాక్షి దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. ఈ ఆలయం  తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి.
  • ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారు కొలువై ఉండి భక్తుల చేత విశేష పూజలను అందుకుంటున్నారు.  ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శివ కంచిలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అమ్మవారి ఆలయం అనేది లేదు.
  • కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు. పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తి నంతటిని గ్రహించి మన్మధునిలో ఆవహింప చేసింది అని పురాణాలు చెబుతున్నాయి.
  • సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కాని ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉండటం విశేషం.
  • అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామి వారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రం పై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మ వారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండటమే కాకుండా, యంత్రానికి పూజలను నిర్వహిస్తుంటారు.
about hiuiఈ విధంగా శివ కంచిలో వెలసిన కామాక్షి అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవంలో భాగంగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అదేవిధంగా శివ కంచిలో వెలసిన అమ్మవారి ఆలయం పర్యాటక క్షేత్రంగా
ఎంతో ప్రసిద్ధి చెందింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR