బెండ వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలేంటో తెలుసా ?

ప్రస్తుత ఉరుకుల పరుగుల రోజుల్లో అందరిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవటం అనేది పరిపాటి అయింది.. ఈ ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు సైతం కారణమవుతుంది.. అలా వచ్చే సమస్యల్లో ఒకటి డయాబెటిస్.. ఒత్తిడి, సరైన ఆహార నియమాలు పాటించక పోవటం వలనే ఈ సమస్యలు.. కానీ దైనందిన జీవితంలో ప్రతిఒక్కరికి ఒత్తిడి తప్పటం లేదు.. దీంతో వయసు బేధం లేకుండా చిన్నా పెద్ద వాళ్లలో కూడా షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి..

Health Benefits Of Lady's Fingerఅయితే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల నివారణకు బెండకాయ బెస్ట్ అంటున్నారు శాస్త్రవేత్తలు.. ఎందుకంటే బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. దీనిలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాక అదనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మనకి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. మరి బెండ వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

Health Benefits Of Lady's Fingerబరువు తగ్గించటంలో బెండ బాగా తొడపడుతుంది.. . బెండను నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లబించడంతో బాడీ మెటబాలిజం మెరుగుపడి తద్వారా బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

Health Benefits Of Lady's Fingerడయాబెటిస్‌ను అదుపు చేయడం లో బెండ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది..దీనిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్‌ కూడా ఉంటుంది. ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది.

Health Benefits Of Lady's Fingerగుండె వ్యాధుల నియంత్రణకు బెండ తోడ్పడుతుంది.. కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల వచ్చే ముప్పుఉంటుంది.. అధిక కొవ్వు, ఊబకాయంతో బాధపడే వారికి బెండ చేసే మేలు మరువలేనిది. దీనిలోని పెక్టిన్‌ అనే ఫైబర్‌ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. బెండలో ఉన్న పాలిఫినాల్స్‌ ఆర్టరీ బ్లాకులను సైతం నివారిస్తుంది.

Health Benefits Of Lady's Fingerక్యాన్సర్‌ నివారణకు కూడా బెండ ఉపయోగం.. దీనిలో ఉన్న లెక్టిన్‌ రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవల ఓ పరిశోధన నివేదికలో ప్రచురింపబడింది.. బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి

బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్‌ వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉంది.. దీనిలో ఉన్న డయిటరీ ఫైబర్‌ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు నిపుణులు సైతం చెప్తున్నారు..

Health Benefits Of Lady's Fingerగర్భిణి స్త్రీలు నిత్యం బెండకాయను తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్ లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన ఇబ్బందులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే బెండను నిత్యం తీసుకునే ఆహారంలో వాడడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్‌ సీ వల్ల భయంకరమైన వైరస్లను సైతం ఎదుర్కొవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR