ఎప్పుడు పగలు మాత్రమే ఉండే ఆశ్చర్యకరమైన ఆ ప్రదేశాలు ఏంటి?

సూర్యుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే దానిని పగలు అంటారు. అదేవిధంగా సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు రాత్రి అని అంటారు. అయితే భూమి తన చుటూ తాను తిరుతూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు రాత్రి ఏర్పడుతుందని మన అందరికి తెలిసిన విషయం. కానీ ఈ ప్రదేశాలలో 24 గంటలు పగలు అనేది ఉంటుందంటా. మరి ఆశ్చర్యానికి గురి చేసే ఎప్పుడు పగలు మాత్రమే ఉండే ఆ ప్రదేశాలు ఏంటి? అక్కడ ఎప్పుడు పగలు మాత్రమే ఉండటానికి కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rahasyavaaniప్రపంచంలో మొదటగా సూర్యుడు జపాన్ లో ఉదయిస్తాడు. అయితే దాదాపుగా ఏప్రిల్ ఆఖరి వారం నుంచి జులై ఆగస్ట్ వరకు సూర్యభగవానుడు రాత్రి, పగలు అన్న భేదం లేకుండా అన్ని వేళలా కొన్ని ప్రాంతాలలో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి ప్రజలు వెలుగులోనే రోజంతా ఉంటారు.

Sun Riseఈ అద్భుత భౌగోల విన్యాసానికి కారణం ఏంటంటే, వేసవికాలంలో ఉత్తర ధృవం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. అందుకే ఉత్తరార్ధ గోళంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం కానట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశాలను లాండ్స్ ఆఫ్ మిడ్ నైట్ సన్ గా పిలుస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో పగలు అనేది వేసవి కాలంలో 24 గంటలు ఉంటుంది. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నార్వే:

 

Norveనార్వే యూరోపియన్ ఖండంలోని ఒక దేశం. ఈ దేశం పెద్ద పెద్ద పర్వతాలతో మూసేసి ఉంటుంది. ఇక్కడ మే నుండి జులై వరకు సుమారు 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించాడు.

కెనడా:

Canadaప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం కెనడా. ఈ దేశం ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న నార్త్ వెస్ట్ అనే ప్రదేశంలో 56 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు.

ఐస్ ల్యాండ్:

Ice Landనాలుగు పక్కల నీరు ఉంది సముద్రం మధ్యలో ఈ ఐ ల్యాండ్ ఉంటుంది. అయితే ఎంతో అందమైన ఈ దేశం యూరప్ లో రెండవ అతిపెద్ద దేశంగా చెబుతారు. ఇక్కడ సూర్యుడు మే నుండి జూన్ వరకు అస్తమించడు.

స్వీడెన్:

Sweedanఇక్కడ విశేషం ఏంటంటే సూర్యుడు అర్ధరాత్రి అస్తమించడం మనం చూడవచ్చు. మే నుండి ఆగస్టు వరకు ఇక్కడ సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి ఉదయం 4 గంటలకు ఉదయిస్తాడు.

Sun Riseఅయితే చీకటి అనేది లేని ఈ ప్రదేశాలను చూడడానికి ఈ ప్రాంతాలకి పర్యాటకుల సందడి ఆ సమయంలో ఎక్కువ గా ఉంటుంది. ఇంకా ఆ దేశాల్లో ఈ అరవై రోజులూ రకరకాల ఉత్సవాలూ గొప్పగా జరుగుతాయి. ఈ ప్రాంతాలలో వేసవిలో రాత్రి లేని పగలు ఉన్నట్టే శీతాకాలంలో పూర్తిగా పగలు అనేది కూడా ఉండదని చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR