బ్లడ్‌ క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటున్న సమస్య క్యాన్సర్. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలనే క్యాన్స‌ర్లుగా పిలుస్తారు.

Symptoms That Appear When Blood Cancer Occursఅయితే ఏ క్యాన్సర్లనైనా ముందుగా గుర్తిస్తే వాటికి చికిత్స అందించేందుకు వీలుంటుంది. అందులో ప్రధానమైనది బ్లడ్ క్యాన్సర్. ఇది చాలామందికి సోకుతుంది. బ్లడ్ క్యాన్సర్ చాలా సాధారణంగా చూసే క్యాన్సర్ ల లాంటిది కాదు. 10 లక్షల మందిలో 35 మందికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. పిల్లల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. బ్లడ్ క్యాన్సర్ అనేది బ్లడ్ సెల్స్ పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాలు, బోన్ మ్యారోలో ఉండే రక్త కణాలపై ప్రభావం చూపుతుంది. బ్లడ్ క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుంది. క్రోనిక్, అక్యూట్ అనే రెండు రకాలు. ఈ రెండింటికీ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లలోనే కనిపిస్తుంది. మగవాళ్లకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

Symptoms That Appear When Blood Cancer Occursఇండియాలో డయాగ్నోస్ అవుతున్న క్యాన్సర్ కేసుల్లో ఎనిమిది శాతం బ్లడ్ క్యాన్సర్ కేసులే ఉంటున్నాయి. బ్లడ్ క్యాన్సర్ లో ఉన్న రకాల్లో ఇండియా లో ఎక్కువగా వచ్చేవి మూడు రకాలు. 1. లింఫోమా – లింఫటిక్ సిస్టం లో ఏర్పడే ఒక గ్రూప్ ఒఫ్ బ్లండ్ కాన్సర్స్ ని లింఫోమా అంటారు. ఇందులో హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా లు ముఖ్యమైనవి.

Symptoms That Appear When Blood Cancer Occurs2. ల్యుకేమియా – నార్మల్ బ్లడ్ సెల్స్ అదుపు తప్పి కంట్రోల్ అవకుండా పెరుగుతూ ఉంటే దాన్ని ల్యుకేమియా అంటారు. ఎఫెక్ట్ అయిన సెల్స్ ని బట్టి మైలోబ్లాస్టిక్, లేదా లింఫోసైటిక్ ల్యుకేమియా అంటారు. అలాగే, ఎంత ఫాస్ట్ గా పెరుగుతోందీ అన్న దాన్ని బట్టి క్రానిక్, లేదా ఎక్యూట్ అంటారు. ల్యుకేమియా జనరల్ గా బోన్ మారో నుండి స్టార్ట్ అవుతుంది.

Symptoms That Appear When Blood Cancer Occurs3. మల్టిపుల్ మైలోమా – ఈ కాన్సర్ కూడా బోన్ మారో లోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఇందులో ప్లాస్మా సెల్స్ కంట్రోల్ లేకుండా పెరుగుతాయి. ఇవి పెరుగుతున్నప్పుడు ఇమ్యూన్ సిస్టం ని కాంప్రమైజ్ చేసి ఎర్ర రక్త కణాలూ, తెల్ల రక్త కణాల ప్రొడక్షన్ నీ, వాటి పని తీరునీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇందువల్ల బోన్ డిసీజ్, ఆర్గన్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

Symptoms That Appear When Blood Cancer Occursమరి బ్లడ్‌ క్యాన్సర్‌ ఎలా వస్తుంది..? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..? బ్లడ్‌ క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు మన జీవనశైలిలో ఏవైనా మార్పులు చేసుకోవాలా..? అనే విషయాలు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో బ్లడ్‌ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలేవీ పైకి కనిపించవు. చివరి దశకు చేరుకున్న తర్వాతనే గుర్తించేందుకు వీలు చిక్కుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.

Symptoms That Appear When Blood Cancer Occursరక్త క్యాన్సర్లతో బాధపడుతున్నవారిలో ఆకలి ఉండదు. ఎప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటారు. జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏదో ఒక రకం ఇన్‌ఫెక్షన్ కనిపిస్తూనే ఉంటుంది. చిన్న గాయం నుంచి అధిక రక్తస్రావం వస్తుంది. రాత్రుళ్లలో ఎక్కువగా చెమటపోస్తుంది. ఉన్నంటుండి శరీరం బరువు తగ్గిపోతారు. బోన్స్‌, జాయింట్లలో భరించలేనంత నొప్పులు వస్తుంటాయి. ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం స్రావం జరుగుతుంది. పీరియడ్‌ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది.

Symptoms That Appear When Blood Cancer Occursశ్వాస సరిగ్గా ఆడకపోవడం, శ్వాస సమస్యలు రావడం, ఎముకలలో పగుళ్లు ఏర్పడటం, వికారం, కడుపు నొప్పి, ఎముకల నొప్పి, మూత్ర సమస్యలు వస్తే క్యాన్సర్ వచ్చినట్టే లెక్క. పెద్ద వాళ్లలో బ్లడ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం.. స్మోకింగ్ అలవాటు. కెమికల్‌ కంపెనీల్లో పనిచేసే వారు రేడియేషన్స్‌ రెగ్యులర్‌గా పొందాల్సి ఉంటున్నందున వీరికి బ్లడ్‌ క్యాన్సర్‌వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే బ్లడ్ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తించగలిగితే.. అంత త్వరగా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR