భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటిది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే ఎన్నో అతిపురాతన ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అయితే ఇప్పటికి కొన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇలా ఇతర దేశాల్లో ఉన్న 8 అతిపెద్ద విగ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నవి? వాటి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ విష్ణు కెంకానా కల్చరల్ పార్క్:
ఇండోనేషియా లో బాలి ద్వీపం లో బడాంగ్ అనే ప్రాంతంలో గరుడ విష్ణు కెంకానా కల్చరల్ పార్క్ ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడ. ఇక్కడ గరుడ అనే పర్వతం పైన 479 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది. ఇండోనేషియా దేశంలోనే ఇది అతి పెద్ద విగ్రహం అని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడి గరుడ విష్ణు కెంకానా కల్చరల్ పార్క్ లో 75 అడుగుల హనుమంతుడి విగ్రహం కూడా ఉంది.
కైలాసనాథ మహాదేవ్ విగ్రహం నేపాల్:
నేపాల్ లో పశుపతినాథ్ దేవాలయం, ముక్తినాథ్ వంటి ఎంతో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నవి. అయితే నేపాల్ లోని కైలాసనాథ మహాదేవ్ విగ్రహం 144 అడుగుల ఎత్తు ఉంది. ఇది నేపాల్ లో ఒక గొప్ప పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది.
కార్తికేయస్వామి మలేసియా:
మలేసియా లో బటు కేవ్స్ అనే ప్రాంతంలో 140 ఆడుగుల సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ఉంది. ఇది మలేషియాలోనే అతి పెద్ద విగ్రహం. ఈ స్వామివారి విగ్రహం వెనుక 272 మెట్లను ఎక్కితే పర్వత శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ 12 సంవత్సరాల కి ఒకసారి కార్తికేయ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
మంగళ్ మహాదేవ్ విగ్రహం మారిషస్:
మారిషస్ లోని గంగా తలావ్ గడిలో మంగల్ మహాదేవ అని పిలువబడే శివుడి విగ్రహం 108 అడుగుల ఎత్తు ఉంది. ఈ విగ్రహం చూడటానికి వడోదర లో ఉన్న శివుడి విగ్రహం వలెనే ఉంటుంది. శివుడికి అంకితం చేయబడిన ఈ ప్రాంతంలో హనుమంతుడి ఆలయం, గంగ దేవి, గణేశుడి ఆలయాలు కూడా ఉన్నాయి.
దుర్గామాత విగ్రహం మారిషస్:
మారిషస్ లో 108 అడుగుల దుర్గామాత విగ్రహం ఉంది.
హనుమంతుడి విగ్రహం ట్రినిడాడ్ మరియు టొబాగో:
ట్రినిడాడ్ మరియు టొబాగో ఉన్న కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం 85 అడుగులు ఉంటుంది. ఇంకా ఇక్కడ అనేక ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి.
హనుమంతుడి విగ్రహం దక్షిణాఫ్రికా:
దక్షిణాఫ్రికాలో హనుమంతుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహం దక్షిణాఫ్రికాలోని అతిపెద్దదిగా చెబుతారు.
శివ శక్తి విగ్రహం దక్షిణాఫ్రికా:
శివుడు అర్ధనాధీశ్వరుడిగా దర్శనం ఇచ్చే అద్భుతమైన విగ్రహం ఇది. ఇక్కడ శివుడు సగభాగం శివుడిగా, సగభాగం పార్వతీదేవిగా దర్శనం ఇస్తుండంతో ఈ విగ్రహాన్ని శివ శక్తి విగ్రహం అని పిలుస్తుంటారు.