త్రిఫలాలో ఒకటైన తానికాయ విశేషాలు!

ఆయుర్వేదంలో త్రిదోషాలు అనే పదం బాగా వినిపిస్తుంది. అంటే ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వలనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే రోగాలు వస్తుంటాయి. కఫ దోషం వలన కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయులు నయం చేస్తాయి. తానికాయని అచ్చ తెలుగులో వాక కాయలుగానూ పిలుస్తుంటారు. తెర్మినలియా బెల్లిరికా శాస్త్రీయ నామం కలిగిన ఈ వృక్ష సంతతి ఆయుర్వేద వైద్యంలోనే కాదు వంటింటి చిట్కా వైద్యాలలోనూ తనదైన ఫలితాలను అందిస్తూ…. సామాన్యులకి చేరువగా ఉంటోంది.

tridoshaత్రిఫలములలో తానికాయ ఒకటి. త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది. తీవ్రమైన వేడిని కలిగించే ఈ కాయలు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తు న్నాయి. బాదం చెట్టును పోలి ఉండి అదే తరహా ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి, లేత పసుపు రంగున్న పుష్పాలు, నక్షత్ర ఆకారపు చిన్నపాటి కంకులని కలిగి ఉంటుంది. చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్లను పోలి ఉండే ఈ తాని కాయలు గుండ్రంగా ఉండి.. కాస్త ఫలాలుగా మారాక ఉసిరి కాయ సైజులో మట్టిరంగులో కనిపిస్తాయి. ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తాని కాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు, జీర్ణ వ్యవస్ధలో వచ్చే రుగ్మతలను నివారించేందుకు ఉపయోగ పడుతుంది.

tanikayaతానికాయలో బెటాసిటోస్టిరాల్‌, గాలిక్‌ యాసిడ్‌, ఎలాజిక్‌ యాసిడ్‌, చెబులాజిక్‌ యాసిడ్‌, గైలాయల్‌, గ్లూకోజ్‌, సుగర్‌, మైనిటాల్‌, గ్లాక్టోజ్‌, ఫ్రక్టోజ్‌, రమ్‌నోస్‌, గ్లూకోసైడ్‌, ఫాటియాసిడ్స్‌ఉన్నాయి. గింజలలో ప్రొటీన్‌, ఆక్సాలిక్‌ యాసిడ్‌లు ఉన్నాయి. అతిసారము, మూల శంకలను నివారిస్తుంది. త్రిఫల కషాయం శూలలను తగ్గిస్తుంది. మెదడుకు శక్తిని చేకూరుస్తుంది. తేనెతో కలిపి సేవించిన మూత్ర సంబంధ వ్యాధులు నివారింప బడతాయి. అశ్వగంధ, తానికాయ చూర్ణములను సమంగా తీసికొని బెల్లంతో కలిపి వేడినీటితో సేవించిన వాతం హరించును.

diarrheaతానికాయ చూర్ణంలో కొద్దిగా చక్కెరను వేసుకుని ప్రతిరోజూ స్పూన్ మోతాదులో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ తానికాయ చూర్ణంలో కొద్దిగా తేనె కలుపుకని తీసుకుంటే గొంతులో నొప్పి, మంట తగ్గుతాయి. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది. ఈ తానికాయ గింజల పప్పును రాత్రిపూట తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. తానికాయల చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఆస్తమా వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం పాత బెల్లం సమాన మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా వాతం వలన వచ్చే నొప్పులు తగ్గుతాయి.

throatలివర్‌కి సంబంధించిన టానిక్‌ల తయారీలోనూ…అజీర్ణానికి చెందినమందుల తయారీ లోనూ, దగ్గు, కఫం,క్షయ,ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికామ మంచి మందుగా వాడబడుతోంది. డయేరియా, డీసెంట్రీ, చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి, ఉదర వ్యాధులను శాంత పరిచేందుకు ఉపయోగ పడుతుంది. కేశ సంపదని పెంపొందించేందుకు,జుట్టు నల్ల బడేందుకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. తానికాయలని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని, కాసింత సైంధవ లవణాన్ని కల్పి సేవిస్తే విరోచనాలు క్షణాలలో తగ్గిపోతాయి. సర్పి అనే చర్మ వ్యాధితో బాధ పడేవారు తానికాయని అరగదీసి, ఆగంధాన్ని లేపనంగా పూస్తే ఉపశమనం దక్కుతుంది.

asthmaయాంటి హేల్మెంతిక్ (నులి పురుగులు నివారణకు), యంతిస్పమోదిక్, యాన్తి పైరేతిక్గా (శరీర వేడిని నిరోధి౦చుటకు) పనిచేస్తుంది. తానికాయ గింజలలోని పప్పు మూత్రాశయము లోని రాళ్ళను కరిగిస్తుంది. తానికాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. తానికాయ పప్పును తేనెతో కలిపి ఇస్తే సుఖ నిద్రను కలుగ చేస్తుంది. తానికాయ గింజలలోని పప్పును మెత్తగా నూరి పైన పూతగా పూస్తే వాపులు తగ్గుతాయి. నేతితో వేయించిన తానికాయ పెచ్చును చప్పరిస్తే గొంతు బాధలు తగ్గి స్వరం సర్ధుకుంటుంది. తానికాయల చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఆస్తమా వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

inflammation

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR