Home Entertainment 12 Telugu Movies In Last 5 Yrs That Won Many Hearts For...

12 Telugu Movies In Last 5 Yrs That Won Many Hearts For Nativity & Essence In Every Frame

0
Telugu Movies

నిన్న వచ్చిన సినిమా బండి….మొన్న కంచరపాలెం, ఆ మొన్న వచ్చిన రంగస్థలం…ఈ సినిమాలు మన తెలుగు వాళ్ళకి విపరీతంగా నచ్చడానికి గల మొదటి కారణం…? maro మాట లేకుండా నేను ఏం చెప్తాను అంటే ఈ సినిమాల్లో ఉన్న తెలుగుదనం, మన ఊరి నేపధ్యం, మన ఊరిని గుర్తు తెచ్చే ఆ పాత్రలు, ఆ సంభాషణలు… అవును నిజమే అనిపిస్తుంది కదా…

ఇలా ఈ మొద్దు సిఎంమాలు మాత్రమే కాదు తెలుగు ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో…అంతే మంచి తెలుగు నేపధ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను, సంభాషలను మనకు గుర్తు తెస్తుంది…ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో మనకు అమ్మ, ఆవకాయ, తెలుగు ఎప్పటికి బోరు కొట్టావు అనేలా తీసిన కొని సినిమాలు ఇప్పుడు చూసేద్దామా మరి…

1. C/o Kancharapalem

దర్శకుడు మహా కి ఎంత పొగిడిన…ఏం చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ కథ ద్వారా అయన చేపోయాడమనుకున్న సందేశాన్ని పక్కన పెడితే…కథలో పాత్రలను అయన మలిచిన విధానం, తెరకెక్కించిన తీరు…ప్రతి లంజకొడుక్కి నా పెళ్లి గురించే అనే బూతు…బూతు లాగా అనిపించకూండా నవ్వించాడు మరి.

2. Colour Photo

ఇందులోనూ అంతే ప్రతి పాత్ర తెలుగు లోనే మాట్లాడ్తుంది….పైగా మన ఊరు, మనం వెళ్లిన కాలేజీ, మనం బీటేసిన అమ్మాయి అందరు గుర్తొచ్చేస్తారు మరి సినిమా చూస్తే…!

3. Uma Maheswara Ugra Roopoasya

మహా మరో మెట్టు ఎక్కేసాడు అనిపించింది ఇందులో కొన్ని సన్నివేశాలు చూసాక…ఒక రీమేక్ చిత్రాన్ని మన తెలుగు నేపధ్యాన్ని అన్వయించి, అతను పలికించిన డైలాగులు…అరకు లోయల అందాలు ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాము అనే మంచి అనుభూతుని ఇచ్చాయి.

4. Middle Class Melodies

సదురు హీరోని నాన్న ఒరేయ్ ముండా…. అని తిడ్తుంటే….మన పిల్లకాయలు వాళ్ళ నాన్నలని వాళ్ళని చూసుకున్నారు మరి తెర మీద. అది ఒక్కటే కాదు హీరోయిన్ తో ప్రేమాయణం, ఆ ఊరు, అంత కూడా అలానే ఉంటాయి మరి.

5. Palasa

మీలో ఎంత మంది చూసారో తెలియదు కానీ…ఇప్పటికి కొన్ని ఊర్లలో ఉండే కులం అనే కథ వస్తువుని తీసుకుని మన తెలుగు నేపధ్యం….నాది నాక్కిలీసు గొలుసు లాంటి తెలుగు జానపదంని పెట్టి అందరు పాడుకునేలా తీశారు దర్శకుడు కరుణ కుమార్.

6. Mallesham

బయోపిక్ ల జమానా నడుస్తుంది…కానీ ఎక్కడి మారుమూల ఊరిలో మగ్గం, చేనేతల కోసం చింతకింది మల్లేశం కానీ పెట్టిన ఆసు మెషిన్, అయన పడిన శ్రమని, మనకు చుపించాలనుకోవడం సాహసమనే చెప్పాలి. మరి ఎంతడాబులు వచ్చాయి ఎంత ఊయాయి అనియెడి పక్కన పెడితే మన తెలుగు జాతిలో ఒక భాగమైన కథను చాల సున్నితంగా తీసి కొందరు మనుసులు గెలుచున్నారు అని మాత్రం చెప్పగలను.

7. Cinema Bandi

ఇక ప్రతి మనిషిలో ఒక దర్శకుడు ఉంటాడు…ప్రతో ఒక్కరి దగ్గర కథ ఉంటుంది…అది మనం చూడాలే కానీ…మన చుట్టూ జరిగేవి అన్ని సినిమాలే అన్న చిన్న కథను maridesh బాబు, వీరబాబు, మంగ మరియు ఇతర పాత్రల ద్వారా భలే చూపించాడు.

8. Fidaa

తెలంగాణ యాస, బాషా లో ఉన్న కమ్మదనం, చమత్కారంతో పాటు బాన్సువాడ అనే ఊరు ఆ ఊరిలో ఉండే భానుమతి పాత్రల ద్వారా ఒక మంచి తెలుగు కథని మనకు అందించారు శేఖర్ కమ్ముల గారు. ?

9. Uyyala Jampala

ఇక బావ మరదలు అనే బంధం మధ్య ఎన్ని సినిమాలు వచ్చిన చూస్తూనే ఉంటాము. అలాంటిది ఈ బావ మరదలు మధ్య జరిగే గొడవలను ఒక పల్లెటూరి నేపధ్యంలో, వాళ్ళు మాట్లాడే ఆంధ్ర బాషా…భలే ఉంటాయి.

10. SVSC

ఇద్దరు అన్నదమ్ములు హీరోలుగా అది కూడా పెద్ద హీరోలు. ఒక పల్లేటూరు, ఒక ఇల్లు ఆ ఇంట్లో ఉండే పెద్దయన, అమ్మా, కోపం ముక్కు మీద ఉండే పెద్దోడు, చలాకి చిన్నోడు – విల్లా మధ్య ఒక ముసలిది. ఇది చాలదు ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అని చెప్పడానికి అందుకు తగ్గ డైలాగులు, పాటలు, సన్నివేశాలు…అన్ని కలిస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

11. Mail

ఒక పల్లెటూరు ఓ ఊర్లో ఉండే కుర్రాడు…అతనికి ఉండే కంప్యూటర్ పిచ్చి..అది తీర్చని ఒక తండ్రి. మధ్యలో కొంచెం హాస్యం, ప్రేమాయణం, కొన్ని ఎమోషనల్ సీన్స్ మధ్య ముగిసే ఒక తీపి గుర్తు లాంటిది ఈ సినిమా.

12. Rangastahalam

ఇక చివరగా మన సుకుమార్ గారు మన అందరిని తీసుకెళ్లిన రంగస్థలం అనే ఊరు మనకు పరిచయమా చేసిన చిట్టి బాబు, రంగమ్మ, కుమార్ బాబు, ప్రెసిడెంట్ గారు…అనే పాత్రలు ఆ పాత్రల తళుకుప్రేమ, కోపం, బాధ…సినిమాలో పాటలు, డైలాగులు, వాళ్ళు కట్టుకున్న బట్ట నుంచి అన్ని మన తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకుని గర్వ పడే సినిమా.

Exit mobile version