కుంకుడు కాయలతో కలిగే అద్భుత ప్రయోజనాలు

0
376

రెండు దశాబ్దాల క్రితం వరకూ తలస్నానం అంటే కుంకుడుకాయలు కొట్టాలి. రసం తీయాలి. కానీ క్రమంగా కుంకుడుకాయ సైడయిపోయి ఆ ప్లేస్ లో షాంపూ చొరబడిపోయింది. కుంకుడుకాయ కి ఆదరణ తగ్గడానికి కారణం కచ్చితంగా కుంకుడుకాయ వాడకంలోని కష్టమే.

amazing benefits of kunkud nutsకుంకుడు రసం కళ్లలో పడితే మంట… నోట్లోకి వెళితే చేదు… దాంతో పిల్లలయితే అవంటేనే గగ్గోలు పెట్టేవారు. ఇవన్నీ అలా ఉంచితే వాటిని కొట్టాలి. రసం తీయాలి. ఇంత కష్టం ఎందుకని ప్రతి ఒక్కరూ ఇష్టంగానో కష్టంగానో షాంపూకి అలవాటుపడిపోయారు.

amazing benefits of kunkud nutsఇది కాసేపు పక్కన పెడితే కుంకుడు కాయలు తలంటుకి, శిరోజాలు బాగుండాలని, చుండ్రు సమస్య పోవాలని వాడతాం. అయితే కుంకుడు కాయలను సరిగ్గా వాడితే ఇంట్లోకి వచ్చే దోమలు కీటకాలని కూడా రాకుండా చేయవచ్చట అది ఎలా అనేది చూద్దాం.

amazing benefits of kunkud nutsముందుగా కుకుండుకాయల్ని ఓ 150 గ్రాములు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఓ గంట తర్వాత… వాటిని ఉడకబెట్టండి. ఇలా బాగా ఉడకబెడితే వాటిలో కషాయం అంతా నీటిలోకి వచ్చేస్తుంది. రంగు మారుతుంది.తర్వాత ఆ నీరు చల్లారబెట్టి పొడిగుడ్డ లేదా చిక్కంతో ఆ కుంకుడు కాయల రసాన్ని ఫిల్టర్ చేయండి.

amazing benefits of kunkud nutsదీనిని ఓ ఫిల్టర్ బాటిల్ లేదా స్ప్రే చేసే దానిలో పోసుకోవాలి. దాన్ని కిచెన్ మూలన కానీ డస్ట్ బిన్ దగ్గర కానీ స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల ఏ కీటకాలు, ఏ దోమలు చీమలు రాకుండా ఉంటాయి. కిటికీలు, అద్దాల పై స్ప్రే చేసినా అవి కూడా మెరుస్తాయి.

 

SHARE