కార్తీక మాసం అంటే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు ,ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం. కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం.
కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారు ఝూమునే కార్తీక స్నానమాచరించడం, నిత్యం దీపాన్ని వెలిగించడం, ఆరాధించడం, నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించడం వలన పాప దోషాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది.
హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి పెద్ద ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీకమాసంలో దానాలు చేయడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి. అదే సమయంలో జీవితం కూడా సార్థకమవుతుందని వేదాలు చెబుతున్నాయి. అవేమితో చూద్దాం..
1. గోదానం చేస్తే – ఋణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
2.భూ దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది.
3.వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.
4.బంగారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.
5. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది.
6.పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
7.పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
8. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
9. తేనె దానం చేస్తే – సంతాన ప్రాప్తి కలుగుతుంది.
10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
11. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
12. పండ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
13. అన్న దానం చేస్తే – పెదరికం పోయి, ధన వృద్ధి కలుగుతుంది.
14. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
15. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.