Home Health యోగ వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

యోగ వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

యోగ అనేది మన భారతీయ గ్రంధాలలో వివరించిన ఒక పురాతన కళ. యోగ అనేది బరువు తగ్గడం మరియు ఫిట్నెస్ కోసం చేసే మంచి వ్యాయామం. యోగా వలన ఇతర వ్యాయామాల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆధునిక శాస్త్రంలో ఋషులు యొక్క జ్ఞానం మిళితం అయి ఉంటుంది.

health benefits of yogaయోగలో చాలా ఆసనాలు మరియు భంగిమలు ఉంటాయి. అలాగే ముద్రలు కూడా ఉంటాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ యోగ ముద్రలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రతి యోగ ముద్రకు చాలా ప్రత్యేకమైన మరియు చాలా ఖచ్చితమైన మార్గంలో సాధన ఉంటుంది. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. దీన్ని ఎంతో ప్రయోజనకరమైన ఆసనం అని యోగా గురువులు అంటున్నారు.

ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు కాళ్లను ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. కుడికాలికి మోకాలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదము తీసుకొని ఎడమ తొడ మొదలు దగ్గర కుడి మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదములు తీసుకొని కుడి తొడ మొదలు దగ్గర ఎడమ మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి.

కింద నుంచి మెడ వరకు వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చాచి ఎడమ చేయి ఎడమ మోకాలి వద్ద కుడిచేయి కుడి మోకాలి వద్ద ఉంచాలి. బొటనవేళ్లను కలిపి మిగిలిన మూడు వేళ్లను చాచి ఉంచాలి. లేకుంటే ఒక అరచేయి మీదుగా ఇంకో అరచేయిని రెండు పాదములు ఒక దానిని ఒకటి కలిపిన దగ్గర ఉంచుకోవచ్చు.

కాళ్ల స్థితిని మార్చి అంటే ఎడమ పాదమును కుడితొడ మీద, కుడిపాదమును ఎడమతొడ మీద వచ్చేలా చేయాలి. రెండు కాళ్లు సమానంగా పెట్టాలి. కింద కూర్చోవడం అలవాటు లేనివారికి ఈ ఆసనం వేసేటప్పుడు విపరీతమైన నొప్పి మోకాళ్ల వద్ద కలుగుతుందని యోగా గురువులు చెబుతున్నారు. కానీ నొప్పికి తట్టుకొని శ్రద్ధగా సాధన చేస్తే నొప్పి క్రమంగా తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

  • మొదట మోకాళ్ళనొప్పులు తగ్గిపోతాయట.
  • మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఉత్సాహం ఇస్తుంది.
  • జీర్ణవ్యవస్థ, ఉదర భాగంలోని అవయవాలన్నీ బాగా పనిచేస్తాయంటున్నారు యోగా గురువులు.
  • ఈ ఆసనం ప్రాణాయామం, ధ్యానం చేయుటకు చాలా ఉపయోగకరమైంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి పైకిలేపడానికి ఈ ఆసనం చాలా ఉపయోగకరం.
  • కుండలినీ శక్తి శరీరంలోని వెన్నెముక క్రింది భాగమున చుట్టుకొని నిద్రపోతున్న సర్పంలా ఉంటుంది.
  • ఈ కనిపించని అతర్గతముగా ఉన్న శక్తిని మేలుకొలిపి వెన్నెముక ద్వారా పైకి మెదడులోకి శక్తి వెళ్లడంతో అసమానమైన జ్ఞానము కలిగి మానవుడు అనుకున్నది సాదిస్తాడు.

 

Exit mobile version