గుడిమల్లం ఆలయంలోని పురాతన శివలింగం ప్రాముఖ్యత!

0
2306

గుడిమల్లం గ్రామం తిరుపతి నుండి తిరుపతి – శ్రీ కలహస్తి మార్గం ద్వారా పాపనైదుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ అందమైన శివాలయం ఉన్నందున పారాసురామేశ్వర ఆలయం అని ప్రసిద్ది చెందింది. గుడిమల్లం ఆలయం క్రీ.పూ 3 వ శతాబ్దం వరకు గుర్తించిన పురాతన శివాలయంగా పరిగణించబడుతుంది. ఇక్కడి ప్రభువును పరశురామేశ్వర అని పిలుస్తారు మరియు ఈ లింగం త్రిమూర్తులను వర్ణిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయ పురాణం విష్ణువు అవతారమైన పరశురాముడితో కలుపుతుంది.

Gudimallamఈ ఆలయం యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఆలయ గర్భగృహంలో ఉన్న లింగంలో ఉంది. ఇది ఇప్పటివరకు కనుగొన్న పురాతన శివలింగం అని భావించబడింది.ఈ ఆలయంలోని శివలింగం ఆకారం అచ్చంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దాని మీద రాక్షసుడి భుజాలపై నిల్చున్న శివమూర్తి ఉంటాడు. మంగోలులని పోలిన ఈ రూపం ఖజురహోలా కూడా కనిపించడం విశేషం. ఇక శివుడి కుడిచేతిలో జింక, ఎడమ చేతిలో భిక్షపాత్ర, ముంజేతికి కడియం, చెవులకి కుండలాలు, భుజం మీద గండ్ర గొడ్డలి, తలకు తాటికాయల కిరీటం, మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి.

Gudimallamఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మితమైంది. గర్భాలయంపై కప్పు గజపృష్టాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు.

Gudimallamచోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ”తిరువిప్పరంబేడు” అని పిలిచినట్లు తెలుస్తోంది. అంటే తెలుగులో ‘శ్రీ విప్రపీఠం’ అంటారు. పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లం అయింది. కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.

Gudimallamఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిందంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు. అక్కడ ఉన్న లింగానికి ఈ గుడిమల్లం ఆలయంలో ఉన్న శివలింగానికీ బాగా దగ్గరి పోలికలు ఉంటాయి.