శివుడి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలోనే శాపానికి గురైన చంద్రుడు తిరిగి తన కాంతిని పొందిన స్థలంగా చెబుతారు. శివుడు తనకు తానుగా లింగరూపంలో వెలసిన ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదిగా చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రంలోని వీరవాల్ అనే ప్రాంతంలో శ్రీ సోమనాథేశ్వర దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం అతి ప్రాచీనమైనదిగా చెప్పుతారు. అయితే మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ క్షేత్రం మొదటిది. దీనినే ప్రభాసతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ సోమనాథ్ ఆలయాన్ని చంద్రుడు బంగారం తోను,రావణుడు వెండితోను,శ్రీ కృష్ణుడు చెక్కతోను నిర్మించినట్లు పూర్వీకుల నమ్మకం.
స్కంద పురాణం ప్రకారం, పరమశివుడు తనకు తానుగా లింగ రూపంలో ఇక్కడ వెలిసాడు. కేవలం కోడిగుడ్డు పరిమాణంలో ఉండే ఆ లింగం సూర్యుని కన్నా ఎక్కువగా కాంతి చిందుస్తూ భూమి లోపలగా ఉండేది. ఆ లింగం చుట్టూ ఒక పాము చుట్ట చుట్టుకొని ఉండేది. అందుకే ఆ లింగం ను స్పర్శలింగం అని అంటారు.
ఇక పురాణానికి వస్తే, దక్ష ప్రజాపతికి ఉన్న 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేయగా, చంద్రుడు ఒక్క రోహిణి మీద ఎక్కువ అభిమానం చూపిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉండగా, దక్షుడు ఎన్నిమార్లు హెచ్చరించిన చంద్రుడు అలానే ఉండటంతో అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుడిని క్షయ వ్యాధి గ్రస్తుడై పొమ్మని శపించాడు. పశ్చత్తాపం చెందిన చంద్రుడు శాపం ఉపసంహరించామని మామగారిని ప్రార్ధించగా అది నావల్ల అయ్యే పని కాదని కేవలం పరమ శివుడికి మాత్రమే సాధ్యమని దక్షుడు చెప్పాడు.
అప్పుడు చంద్రుడు ఈ ప్రభాసతీర్దానికి వచ్చి, ఇక్కడ స్వయంభువుగా వెలసిన సర్పలింగముని ప్రార్థిస్తూ నాలుగు వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేయగా, అప్పుడు శివుడు ప్రత్యేక్షమై, దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యమని అయితే నెలలో పదిహేను రోజులు కాంతివంతంగా అభివృద్ధి చెందుతూ, మిగిలిన పదిహేను రోజులు కొంచెం కొంచెం క్షయ చెందుతావని వరం ఇచ్చాడు.
అలా చంద్రుడు తన కాంతిని తిరిగి సంపాదించుకున్న స్థలం కనుక దీనికి ప్రభాసతీర్థం అని పేరు వచ్చినది. తరువాత చంద్రుడు బ్రహ్మ దేవుడిని ప్రార్ధించగా అయన ఇక్కడికి వచ్చి భూమిని కొద్దిగా తొలగించి అందులో ఉన్న సర్పలింగాన్ని బయటకి తీసాడు. ఆ సర్పలింగం యొక్క కాంతి అందరు చూసి తట్టుకోలేనంత ప్రకాశవంతంగా ఉండటంతో, దానిని యధాస్థానంలో ఉంచి దాని మీద ఒక రాతిని ఉంచారు. దానినే బ్రహ్మశిల అంటారు. ఈ బ్రహ్మ శిలమీద మీద బ్రహ్మదేవుడు స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్టించాడు.
అలా చంద్రుడి కారణంగా వెలసిన స్వామి కనుక ఇక్కడ ఉన్న స్వామి సోమనాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడని పురాణం