గణపతి బ్రహ్మచారిగా ఎందుకు మారవలసి వచ్చిందో తెలుసా ?

0
391

హిందూ దేవుళ్లలో గణపతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది . ఏ శుభకార్యం , పూజ అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అయితే వినాయకుడు సిద్ధిని ,బుద్ధిని కలిగిఉన్న సరే బ్రహ్మచారి. గణపతి బ్రహ్మచారిగా ఎందుకు మారవలసి వచ్చిందో చాల మందికి తెలియదు. దానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం.

Ganeshaఓసారి గంగాతీరంలో వినాయకుడు విహారం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి వివాహం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపంతో ఎప్పటికి బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

Ganeshaప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి బాధతో ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకుంది.

Tulasiవినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

 

SHARE