టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకు వచ్చాం. భూమి మీద కాకుండా.. ఇతర గ్రహాల పై మానవ మనుగడ సాధ్యమవుతుందా ? అనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న సమయంలో అంగారక గ్రహం ఆశలు కల్పించింది. దీనిపై మానవ మనుగడ సాధ్యమే అని తేలింది.
అంగారకుడిపై మానవ జీవనానికి అవసరమైన నీటి కోసం శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే గతంలో గ్రహంపై నీటి జాడ తెలిసింది. అక్కడ సరస్సులు ఉన్నట్లుగా శాస్రవేత్తలు గుర్తించారు. ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు ఐజాక్ స్మిత్ 2018 సంవత్సరంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ ఎక్స్‌ప్రెస్‌లో మార్సిస్ నుంచి సేకరించిన డేటా పరంగా అక్కడ నీటి ఉనికి ఉందని తేలింది.
అయితే గ్రహాలలో ఒకటిగా, గ్రహాలకు సేనాధిపతిగా, ఉగ్ర స్వభావవుడిగా అంగారక గ్రహాన్ని పరిగణిస్తారు.
ఈ సౌర కుటుంబంలో నాలుగవ గ్రహమైన అంగారక గ్రహాన్ని కుజ గ్రహం అని కూడా పిలుస్తారు.
ఈ గ్రహం ఎంతో ఎరుపు రంగును కలిగి ఉండటం వల్ల దీనిని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు. అయితే ఈ అంగారక గ్రహం ఎరుపు రంగును కలిగి ఉండటానికి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి.
అయితే అంగారక గ్రహం ఈ విధంగా ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలు, ఆ పురాణ కథలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ అంగారక గ్రహం పుట్టుక గురించి మన హిందూ పురాణాలలో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు, భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఒకరోజు ఆ విష్ణుభగవానుడు చెమట చుక్క భూమి పై పడటం వల్ల భూమి నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారుతాడు. ఆగ్రహమే కుజ గ్రహం అని పద్మపురాణం తెలియజేస్తోంది.
స్కంద పురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడుకి ఆ పరమశివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. అంధకాసురుడి రక్తం బొట్టు నుంచి 100 మంది రాక్షసులు పుట్టే విధంగా వరం పొందిన అంధకాసురుడి నుంచి ప్రజలను రక్షించాలంటే అంధకాసురుడిని సంహరించాలని ఆ పరమశివుడు రాక్షసునితో పోటీ పడ్డాడు. ఈ భయంకరమైన పోరాటంలో ఆ పరమేశ్వరుడి చెమట ధారలుగా ప్రవహించి ఆ చెమటల వేడికి ఉజ్జయిని నగరం చీలికగా ఏర్పడటంవల్ల అంగారక గ్రహం ఏర్పడిందని స్కంధ పురాణం చెబుతోంది.
ఈ విధంగా భూమి చీలికలో నుంచి పుట్టడం వల్ల సాక్షాత్తు భూదేవి తన సొంత కొడుకు కుజ గ్రహాన్ని భావించిందని ఈ పురాణం తెలియజేస్తుంది. ఎట్టకేలకు ఆ పరమశివుడు అంధకాసురుడని సంహరించి కొత్తగా సృష్టించిన మరొక అంగారకుడు అనే రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు. అందుకోసమే కుజుడు ఎరుపురంగును పోలి ఉంటాడని మరొక కథనం అంగారకుని పుట్టుక గురించి తెలియజేస్తోంది.