దేవాలయానికి వెళ్లిన ప్రతీ భక్తుడు తప్పక స్వామి/అమ్మ అనుగ్రహం కోసం తీర్థం తీసుకుంటారు. అయితే ఈ తీర్థం మూడుసార్లు ఇస్తారు. దీని వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
‘‘అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర/దుర్గావిష్ణు పాదోదకం పావనం శుభం అని చెప్తారు దీనిలోనే అన్ని ఉన్నాయి.. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం. కాబట్టి తీర్థాన్ని పవిత్రమైన మనసుతో స్వీకరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి అని.
ఇక మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి.
అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వాళ్లము అవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.
గోముఖ ముద్రతో తీర్థం తీసుకోవడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి. రక్తంలో చైతన్యం చేరి శరీరంలో మలినాలు బయటకు పోతాయి. అలాగే తీర్థంలో గంగ, కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి ఉంటుంది.