చనిపోతున్నప్పుడు రావణుడు లక్ష్మణుడికి ఉపదేశించిన మాటలు

0
445

రామాయణ గాధ వేల ఏళ్లుగా మన జీవన విధానంలో మమేకమైపోయింది. రామాయణంలోని ప్రతీ ఘటన మనకు ఏదో ఒక విధంగా మార్గదర్శకం చేస్తూ ఉంటుంది. రావణసంహారం కూడా ఇందులో బాగమే. అంతేకాదు రావణుడు పోతూ పోతూ లోకానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసాడు.

రావణుడు లక్ష్మణుడికి ఉపదేశించిన మాటలుబ్రహ్మజ్ఞాని అయిన రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో… రావణుడి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అన్న మాటను ఎప్పుడు గౌరవించే లక్ష్మణుడు రావణుని దగ్గరికి వెళ్ళగానే రావణుడు ఇలా చెబుతాడు.

రావణుడు లక్ష్మణుడికి ఉపదేశించిన మాటలు->నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు.

->ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.

->రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు. ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది.

రావణుడు లక్ష్మణుడికి ఉపదేశించిన మాటలు-> రధసారధితో, కాపలావాడితో, వంట వాడితో, నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగా మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా, ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొ సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా వెనకాడరు.

->నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను.

రావణుడు లక్ష్మణుడికి ఉపదేశించిన మాటలు->దేవుడిని ప్రేమించ వచ్చు లేదా ద్వేషించ వచ్చు కానీ ఏదైనా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి.

ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ రావణుడు ప్రాణాలు వదిలాడు. ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి.ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి.

SHARE