మలబద్ధకం సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో ఇంటి చిట్కాలు

మలబద్ధకం అనేది ఇబ్బందికర సమస్యే. దీన్ని రైట్ టైమ్ లో తగ్గించకపోతే మరిన్ని రోగాల బారిన పడాల్సి రావచ్చు. మలబద్ధకం సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Constipationమలబద్ధకం అనేది ఎంతో సాధారణ సమస్య. ఎంతో మంది ఈ సమస్య గురించి బయటకు వెల్లడించకపోయినా తమలో తాము సతమవుతున్నారు. ఈ సమస్యతో పాటు ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గ్యాస్, బ్యాక్ పెయిన్ అలాగే విపరీతమైన అలసట వంటి ప్రాబ్లెమ్స్ అనేవి మలబద్ధకం సమస్యతో లింక్ అయి ఉంటాయి. డయాబెటిస్, పీసీఓడీ, నిద్ర సరిగ్గా లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తో పాటు బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలున్న వారిలో ఈ మలబద్ధకం సమస్య కనిపిస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ సమస్యను నేచురల్ గానే తగ్గించవచ్చు. మెడిసిన్స్ పై గానీ లేదా సప్లిమెంట్స్ పై గానీ ఆధారపడకుండా సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

తగినన్ని నీళ్లను తాగడం వలన మలబద్ధకం సమస్యను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం కూడా కాన్స్టిపేషన్ కు కారణం. కాబట్టి, తగినన్ని నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. అవసరమైతే రిమైండర్స్ పెట్టుకోండి.

Constipationమీ డైట్, మరియు న్యూట్రిషన్ లో చేసే మార్పులు మలబద్ధకానికి చికిత్స చేయగలవు. రోజంతా ద్రవాలు తాగడం. మీరు ఎంత మోతాదులో మరియు ఏ రకమైన ద్రవాలు త్రాగాలి అని మీ ఫామిలీ డాక్టర్ ని అడిగి తెలుసుకోండి. ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినడం. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన మలబద్ధకాన్ని తగ్గించవచ్చు.రాగిజావ,మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వలన మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు.

Constipationప్రతి రోజు వ్యాయామం చేయడం అనేది మలబద్ధకాన్ని నిరోధించడానికి మరియు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడవచ్చు.

work outsబెల్లాన్ని నేతితో కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, నేతిలో ముఖ్యమైన ఫ్యాట్స్ లభిస్తాయి. ఈ రెండూ కలిపి డైజెషన్ స్మూత్ గా జరిగేందుకు సహాయపడతాయి.

Bellamచాలాసార్లు శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. కాబట్టి, ఈ సమస్యను హెల్తీ వేలో డీల్ చేయాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవడం ముఖ్యం. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ను తీసుకోవడం మరీ ముఖ్యం. దాంతో, శరీరంలో వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ భర్తీ అవుతుంది. మస్క్ మెలన్ పై కూడా ఫోకస్ పెట్టాలి. ఇది బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది. మస్క్ మెలన్ ను సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Curdమీ రోజువారీ మీల్స్ లో పెరుగుకు స్థానం కలిగించడం ద్వారా కూడా మీరు ఉపశమనం పొందవచ్చు. పెరుగు ప్రోబయాటిక్ ఫుడ్. డైజెషన్ ను ఇంప్రూవ్ చేసే క్వాలిటీ పెరుగులో ఉంది. భారతీయలు తమ భోజనంలో పెరుగు లేదా మజ్జిగతోనే ముగిస్తారు. ఇలా ఇండియన్స్ తమ డైట్ లో పెరుగుకు కూడా స్థానమిచ్చారు. కూలింగ్ ప్రాపర్టీస్ ఉండటం వలన పెరుగు స్టమక్ లోని ఇన్నర్ లైనింగ్ కు ఉపశమనం ఇస్తుంది. డైజెషన్ ప్రక్రియ స్మూత్ గా సాగేందుకు తోడ్పడుతుంది.

కాన్స్టిపేషన్ తీవ్రతను తగ్గించేందుకు హాట్ వాటర్ బాత్ కూడా హెల్ప్ చేస్తుంది. హీట్ థెరపీ అనేది కండరాలను రిలాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. హీట్ పాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ తో పొట్టకు హీట్ థెరపీ ఇచ్చినా మీరు ప్రయోజనాన్ని గమనించగలరు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR