These Short Stories About Middle Class People & Their Life Will Make You Think Twice

గడిచిన కాలం ఎంతో మధురం, ఆ రోజులే వేరు, బాల్యం ఒక అద్భుతం ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది కానీ “దిగువ మధ్య తరగతి” బతుకు అనుభవించిన ఏ ఒక్కడు వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకోడు ఎందుకంటే వాడు బతికిన బతుకు అలా ఉంటుంది అటు గెంజి తాగాలేడు ఇటు బెంజు ఎక్కలేడు మధ్యలో నుజ్జు నుజ్జుగా నలుగుతూ ఉంటాడు. సినిమాలలో మధ్య తరగతి జీవితం అనగానే ప్రేమలు ఆప్యాయతలు అని పిచ్చి సూడో ఫిలాసఫీలు చూపిస్తూ ఉంటారు అవి మీరు నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా “ఎగువ మధ్య తరగతికి” గాని లేదా “మధ్య – మధ్య తరగతికి” చెందిన మధ్య తరగతి కానీ మధ్య తరగతి వ్యక్తులు అయ్యి ఉంటారు.

ఈ రోజుల్లో మధ్య తరగతి జీవితం మూడు రకాలు:

1) ఎగువ మధ్య తరగతి జీవితం – అన్ని ఉంటాయి అక్కడ అక్కడ అప్పులు ఉంటాయి(ఎచ్చులకి పొయ్యే మనస్తత్వం)

2) మధ్య మధ్య తరగతి జీవితం – కావలసినవి ఉంటాయి అప్పులు దండిగా ఉంటాయి(పక్కింటి వాడు వదిలే సిగరెట్ పొగని చూసి వీడు సొంత ఇంటిని కాల్చేసుకుంటాడు పొగ రావట్లేదు అని కాస్త కంగారు గల మనస్తత్వం)

3) దిగువ మధ్య తరగతి జీవితం – కేవలం అప్పులు మాత్రమే ఉంటాయి, వడ్డీలు కట్టేక మిగిలిన చిల్లరతో బతుకుతుంటారు(మనస్సు మనస్తత్వాలు అంటే?)

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం “దిగువ మధ్య తరగతి” జీవితం గురుంచి కింద రాయటం జరిగింది.

1) గదితో అనుభవాలు…

అందమైన అద్దె ఇల్లు, గదులు రెండు, దైవం-వంటకి ఒక గది, ఇంకో గదిలో సమన్లు మిగిలించిన స్థలం ఇద్దరికి, కానీ మేము నలుగురం ఆ స్థలంలో అనురాగం ఆప్యాతలతో ఇర్రుకుంటాం. అమ్మ నాన్నకి జారేడు స్థలం మాయిద్దరికి మాత్రం బారెడు స్థలం. ఎప్పుడో చావు నిద్రలో ఉండగా మూత్రం ఆగలేక ఒక్కరిని నిద్రలేపితే, నలుగురం నిద్రలేస్తాం, చూసారా! సముద్రం అంత ప్రేమ మాది. అమ్మ నాన్న గ్లాసు నీళ్లు కూడా ముట్టరు నిద్రపోయే ముందు నాకు మాత్రం ఎందుకో అర్థమయ్యేది కాదు! ఇప్పుడు మేమిద్దరం బైట ఊర్లకి వచ్చేసాం కానీ మధ్య తరగతి ప్రేమలు నిండిన ఆ గది నుంచి అమ్మ నాన్నని బైటకి తీసుకొచ్చే స్తోమత మాకు ఇంకా రాలేదు. పండగలకి అమ్మ రమ్మంటుంది కానీ సెలవు ఇవ్వలేదు అనో సమయం లేదు అనో చెప్పి చాకచక్యంగా మేమిద్దరం ఆ గది నుంచి తప్పించుకుంటూ తిరుగుతుంటాం అంతగా అవసరం అయితే యే ఒక్కడో ఇంటికి పోతాం గాని ఇద్దరం ఒకేసారి వెళ్ళాము. ఎందుకంటే చిన్నప్పుడు అంటే తెలీదు కదా, ఒక్కడికి మూత్రం వస్తే కుటుంబం అంత నిద్రయెందుకు లెయ్యలో అని కానీ వయస్సు వచ్చింది కదా కాస్త ఎబ్బెట్టుగా ఉంది. మా ఇద్దరికి ఇంకా అమ్మ నాన్నకి ఏమి చెయ్యలేకపోయమే అనే గిల్ట్ రోజు రోజుకి నర నరణ పెరుకుపోతున్న ఆ గదికి మేము వెళ్ళాకపోవడం వల్ల అమ్మ నాన్న నిద్రపోయేముందు గ్లాసు నీళ్లు ఇకనైనా యే భయం లేకుండా తాగుతారు అన్నా ఆలోచనే ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఒక గ్లాసు నీళ్లు తాగే ధైర్యం ఇచ్చేం మా తల్లితండ్రులకి మేము. ఆ గదికి మాత్రం మేమిద్దరం ఒకేసారి తిరిగి ఎప్పటికి పోము, తప్పించుకుంటూ తిరుగుతూనే ఉంటాం, ఈ రహస్యాన్ని అమ్మ నాన్న ఎప్పటికి కనిపెట్టలేరు, మీరు దయచేసి చెప్పకండి ప్లీజ్…

2) సగం మూసేసిన Science textbook, విసుగువచ్చి విసిరేసిన tables పుస్తకం…

తూగుమోహంతో పుస్తకాలు ముందుయేసుకొని చదువుతున్నట్టు నాన్న కోసం ఎదురుచూస్తూ అమ్మ ముందు నటిస్తున్నాను. నాన్న త్వరగా వస్తే బాగుండు అమ్మని ఏదో ఒకటి అని నన్ను పడుకోమంటాడు, నేను హాయిగా నిద్రపోవచ్చు. కానీ నాన్న ఇంకా రాలేదు రోజు ఈ సమయానికి వచ్చేస్తాడు ఇవాళ ఏమైందో? హమ్మయ్య మొత్తానికి నాన్న వచ్చేసాడు, డాడీ అంటూ నాన్నని హత్తుకున్నాను, నాన్న చొక్కా నుంచి ఏదో కంపు అది చెమట వాసన కాదు ఇంకేదో, బహుశా ఆల్కహాల్ అయ్యివుండొచ్చు నాన్న తాగడం వాస్తవమే కానీ ఇలా ఇంత కంపు కొట్టే విధంగా మాత్రం యే రోజు తాగి రాలేదు, వచ్చి రాగానే అమ్మతో గొడవ పెట్టుకున్నాడు బూతులు తిట్టాడు అమ్మ కూడా తిరిగి మాట్లాడింది కొట్టుకునే దాకా పోయారు కాసేపు తరువాత అమ్మ నాన్నకి అన్నం పెట్టింది, నాన్న అన్నాన్ని అమ్మని చీదరించుకుంటూనే తినేసాడు. నాన్న పడుకుంటు నన్ను దగ్గరకి రమ్మన్నాడు నాకు భయమేసింది తిడతాడో లేక కొడతాడో అని నన్ను దగ్గరికి తీసుకొని గుండెలపై పడుకోపెట్టుకున్నాడు అబ్బా మళ్ళీ వాసన కంపు కొడుతుంది నాన్న గుండె, అయితే ఇది ఇందాక వచ్చినా ఆల్కహాల్ కంపు కాదు ఇంకేదో నాకు తెలియట్లేదు తెలుసుకుందాం అని నాన్న గుండెని సూక్ష్మంగా పరిశీలిస్తే గుండె పై ఎర్రటి రంగులో గొర్లతో చెక్కబడినట్టు కొన్ని గీతలు కనపడ్డాయి ఒక గీతని ముట్టుకున్నాను అది నాకు ఒక దృశ్యం చూపించింది ఆఫీసులో నాన్నని వాళ్ళ పై అధికారి అందరి ముందు చులకనగా మాట్లాడుతున్నాడు నాన్న మాత్రం మౌనంగా మాట్లాడకుండా నిలుచుకొని ఉన్నాడు ఇప్పుడు ఇంకో ఎర్రటి గీతను తడిమను అది ఏమో imaginary conversations ని చూపిస్తుంది అంటే నాన్న వాళ్ళ పైఅధికారిని అందరి ముందు తిడుతున్నట్టు ఇంకేదో ఆ రోజులో నాన్న అందరి ముందు దైర్యంగా అనలేని మాటలు అన్నిటిని ఇక్కడ మట్లాడుకుంటున్నాడు ఇంకో గీతని చూస్తే అమ్మని అన్నా మాటలు గుర్తుకుతెచ్చుకొని బాధపడుతున్నాడు.

నేను ఇంకా సూక్ష్మంగా చూస్తే అవి ఎర్రటి రంగుతో చెక్కబడిన గీతలు కాదు నెత్తుటి గీతలు నాకు నాన్నని చూస్తే బాదేసి మళ్ళీ కంపు కొడుతున్న ఆ గుండె పైనే తల వాల్చాను నా చెంప అంత తడి అవుతున్నట్టు అనిపించింది లైట్ ఏసీ చూస్తే నా చెంప అంత నెత్తురు, తుడుస్తున్న పోవట్లేదు గట్టిగా లాగాను ఒక గడ్డలాగా వచ్చి చేతిలో పడింది చూస్తే నెత్తురుతో నిండిన పిండంలా ఉంది ఆ నెత్తుటి పిండంలో ఏదో దృశ్యం ఎవరో పరిగెడుతున్నారు నగ్నంగా అది ఎవరో కాదు నాన్న అవును నాన్నే అది, మెడలో “ఆత్మభిమానం for sale” అనే బోర్డ్ ఏసుకొని నగ్నంగా రోడ్డులో తైతక్కలు ఆడుతూ గుండెలు పగిలేలా రోదిస్తూ పరిగెడుతున్నాడు నాన్నని తరుముకుంటూ ప్రభుత్వాలు వాళ్ళ అందమైన మ్యానిఫెస్టోలు ఇప్పటి అప్పులు భవిష్యత్తులో కట్టబోయే వడ్డీలు కుటుంబం ఇంకా నా పై పెట్టుకున్న కలలు అన్ని నాన్నని “corporate prostitute” గా ట్రీట్ చేస్తూ వెంటపడుతున్నాయి. ఆ దృశ్యం చూసి కళ్ళు బైర్లు కమ్మాయి కడుపులో నుంచి పేగులుతో సహా కక్కేస్తా ఏమో అనిపించింది ఆ నెత్తుటి పిండాన్ని తీసి భద్రంగా దాచాను రేపు మట్టిలో గుడి కట్టి అక్కడ పెడతాను ఆ నెత్తుటి పిండాన్ని, అభిషేకాలు జరగలిసింది ఆ నెత్తుటి పిండానికి రాళక్కి రప్పలకి కాదు…నిద్ర మత్తు వదిలింది ఈ కథ మొదట్లో మూసేసిన science text book & tables పుస్తకం వైపు ఒకసారి చూసా నాన్న నెత్తురు అంటుకున్న చేతితో పెన్సిల్ తీసుకున్న, పిడికిలి బిగిసింది, యుద్ధం మొదలైంది.

3) చీమలు అంటే నాకు చిరాకు…

పొద్దునే లేసాను తల అంటుకున్నాను పూజ చేసాను ఆయనకి పిల్లలకి డబ్బాలు సర్ది పెట్టాను అరనిమిషం ముందు గందరగోళంగా ఉన్న ఇల్లు ఇప్పుడు గపచిప్ అయిపోయింది. చీమలు కనిపించాయి గుంపుగా ఆ చీమలు ఏదో మోసుకుపోతున్నాయి ఆ చీమల్లో చాలా మంది మా బంధువులు మా ఇంటి చుట్టూ ఉండే హై క్లాస్ లేడీస్ కనిపించారు ఆ చీమలు అన్ని కలిసి నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది…అనిపించడం ఏంటి నిజంగానే ఆ చీమలు నా పై జోక్స్ వేసుకొని నవ్వుతున్నాయి. ఇంతలో ఒక చీమ వచ్చింది “అక్క రేపు functionకి నా గోల్డ్ నెక్లెస్ పెట్టుకో అక్క, నల్ల పూసల దండ వేసుకొని వస్తే బాగుండదు అనింది.” ఇంతలో ఉంకో సుబ్బానాతి మంగమ్మ చీమ వచ్చి “అక్క అక్క ఎప్పుడు ఒక పట్టుచీరే కట్టుకువస్తావ్ ప్రతి దగ్గరకి, ఈ సారి నా చీర తీసుకో అక్క అనింది.” నాకు ఎందుకో ఈ రెండు చీమల మాటల్లో వెటకారం ధ్వనించింది కోపం కట్టలుదెంచుకుంది చీమలా గుంపుని మొత్తం తొక్కి తొక్కి తొక్కి చంపేసాను. ఏదో ప్రశాంతత. ఇంతలో మధ్యాహ్నం 1 అయింది ఇవాళ గురువారం బాబా గుడికి పోవాలి అని లేసాను నడుస్తూ గడప దాటి బైటకి వచ్చాను రోడ్ మొత్తం చీమలే నడుస్తూ మాట్లాడుతున్నాయి నన్ను పలకరించాయి నేను పలకరించి ఆ చీమలతో ఒక చీమగా కలిసిపొయ్యి వుంకో చీమని చూసి నవ్వడం మొదలుపెట్టాం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR