మామిడి పండును తిన్న తరువాత ఇవి తింటే కలిగే అనర్ధాలు

వేసవి సీజన్ లో వచ్చే అన్ని పండ్లలోకి మామిడి పండు ప్రత్యేకం. అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. ఎండాకాలం వస్తుందంటే వీటి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. వేసవి కాలంలో పుష్కలంగా దొరికే ఈ మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టే పండ్లలో రాజు మామిడి పండు అంటారు. కేవలం ఎండా కాలంలో రెండు నెలల పాటు దొరికే ఈ పండ్లను ఇష్టపడని వారుండరు. ఒక్కో సమయంలో డయాబెటిక్ పేషెంట్లు కూడా మనసు చంపుకోలేక వీటిని తినేస్తుంటారు. అంతగా ఆకర్షిస్తాయి మామిడి పండ్లలో ఎన్నో న్యూట్రియంట్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

మామిడి పండుభారతదేశపు జాతీయఫలం అయిన మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. మామిడి పండులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ఎన్నో వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. మామిడి పండు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..ఫెర్టిలిటీ ని పెంచుతుంది. అయితే ఇంత రుచిగా ఉండే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మామిడి పండుసాధారణంగా ఏవైనా ఫ్రూట్స్ కానీ, ఫుడ్ కానీ తిన్న తరువాత నీళ్లు తాగడం చేస్తుంటాం. కానీ మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దట. అలా తాగితే కడుపు నొప్పి , కడుపులో మంట, శరీరంలో గ్యాస్ మరియు కొన్ని రకాల రసాయనాలు ఉత్పన్నమవుతాయి. దీర్ఘకాలం ఇలాగే కొనసాగిస్తే ప్రేగులకు సంబంధించి అనారోగ్య సమస్యల బారిన పడతారు. కొంతమందికి మామిడి పండ్లు తినడం వలన గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనికి కారణం మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం. చల్లని నీళ్ళు లేదా ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. ఇది గొంతులో చికాకును కలిగిస్తుంది. అందుకే మామిడి పండు తిన్నాక కనీసం అరగంట తరువాత మంచినీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రక్తప్రసరణమామిడి పండు తిన్న వెంటనే కారం అధికంగా ఉండే పదార్థాలు, ఎండు మిరపకాయలు తీసుకుంటే ఉదర సమస్యలు, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. మామూలుగా అయితే పచ్చిమిర్చి తిన్నప్పుడు మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కంటి చూపుకు చాలా మంచిది. కొంతమంది కారంగా ఉండే ఆహారం వండినప్పుడు లేదా పెరుగు అన్నంలో కూడా తింటూ ఉంటారు. అలా తినడం వల్ల నష్టం లేదు. కానీ మామిడి పండ్లతో కలిపి తినడం వల్ల మామిడి పండ్లు తీయగా ఉండడం, పచ్చిమిర్చి కారంగా ఉండడం వలన రెండు విరుద్ధ ఆహారాలు కలిసి కడుపులో ఎసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది.

మామిడి పండుఇక కొందరు మామిడి పండు, పెరుగన్నంలో కలుపుకుని తింటారు. అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే…మామిడి పండు తింటే వేడి చేస్తుంది, పెరుగు తింటే చల్లదనం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తింటే మన కడుపుకు కోపమొస్తుంది. లేనిపోని స్కిన్ సమస్యలు వస్తాయి. మామిడి పండ్లు, పెరుగు ఒకేసారి తిన్నా, లేక వెంట వెంటనే తీసుకున్నా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతారు. టాక్సిన్స్ కూడా వచ్చే ఛాన్సుంది.

మామిడి పండుమామిడి పండు తిన్న తర్వాత… ఒకవేళ ఆరోజు మీ ఇంట్లో కాకరకాయ కూర చేసి ఉంటే… దాన్ని అస్సలు ముట్టుకోకండి. పండు తిన్నతర్వాత కాకరకాయ కూర వేసుకుని అన్నం తింటే వికారం, వాంతులు అవుతాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి. వాస్తవానికి డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ జ్యూస్ కూడా తాగుతుంటారు. చేదుగా ఉండే కాయ అనేక ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మామిడిపండు తిన్న వెంటనే కాకరకాయ తినడం వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరి ఆడకపోవడం శ్వాస సంబంధ సమస్యలు. వికారం ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాకరకాయ తిన్నప్పుడు లేదా కాకరకాయ జ్యూస్ తాగినప్పుడు మామిడిపండు తినకూడదు.

మామిడి పండుఅన్నంటికంటే ముఖ్యం మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. మామిడి పండ్లు తిన్న వెంటనే శీతల పానియాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మన బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో మనకు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. మామిడి పండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందుకే పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలోకి అధిక చక్కెర నిల్వ అవుతుంది. తరచుగా ఇలాంటివి జరిగితే తొందరగా మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి.

మామిడి పండుమామిడి పండ్లు తినడం వల్ల ఒక సారి పెదవులుపై చిన్న చిన్న కురుపులు వస్తాయి. పచ్చిమామిడిలో ఉండే జీడివలన ఇలా రావచ్చు దీని వలన దురద, వాపు ఉంటుంది. ఆర్థరైటిస్కు బాధపడేవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా మామిడి పండు ఎక్కువ తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ స్థాయిలో ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది శరీరంలో రక్త చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR