నార్మల్ డెలివరీ కావాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించాలి

85% స్త్రీలకు ప్రసవం( డెలివరీ)సహజంగా జరిగే అవకాశం ఉంది. స్త్రీ శరీర నిర్మాణం దానికి అనువుగానే ఉంటుంది. కేవలం 15 % వారికి వారి ఆరోగ్య రీత్యా, ఇతర కారణాల వలన ఆపరేషన్ చేసి బిడ్డను తియ్యాల్సివస్తుంది. నేటితరంలో కొందరు నొప్పులు, ఆందోళన ఎవరు పడతారు అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన ఎక్కువ లేకుండా, సునాయాసంగా కనవచ్చని మన పూర్వికులు రుజువు చేశారు.

నార్మల్ డెలివరీసహజమైన డెలివరీ వల్ల పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ (immunity system) బాగా ఉంటుంది. ప్రసవం తరువాత కోలుకోవటం సులభం. శరీరంలో సహజంగా నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండేపని లేదు. మరి ఇన్ని లాభాలున్నప్పుడు సహజమైన డెలివరీ ఎవరు ఒద్దనుకుంటారు. సహజమైన డెలివరీ కావాలంటే, కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలు పాటించాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం.

ఒత్తిడి ని దూరంగా పెట్టండి:

నార్మల్ డెలివరీఅనవసరమైన ఒత్తిడి, నెగెటివ్ గా ఆలోచించటం, ఆందోళన పడటం అస్సలు పనికిరాదు. మనసు నిర్మలంగా, హాయిగా ఉంచుకోండి. దానికి ధ్యానం చెయ్యడం, మీకిష్టమైన సంగీతం, పాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి దృశ్యాల్ని ఊహించుకోవడం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే స్నేహితుల, సన్నిహితుల మధ్య గడపండి.

నిరుత్సాహ పరిచే మాటలు వినకండి:

వాళ్ళు, వీళ్ళు ఒక్కోసారి తెలిసో, తెలీకో కొన్ని కష్టతరమైన ప్రసవాలని గురించి చెప్తూ ఉంటారు. విషాదకరమైన విషయాలు వినకండి. ఎక్కడో నూటికో, కోటికో ఒక్క డెలివరీ కొన్ని అనివార్య కారణాలవల్ల విషాదం సంభవించవచ్చు. కానీ మనకి ఏమీ కాదు, అని గట్టిగా మనసులో అనుకోవాలి.

నార్మల్ డెలివరీఅవగాహన పెంచుకోండి:

భయాన్ని, బెరుకుని పోగొట్టేది అవగాహన. అందుకే అసలు డెలివరీ ఎలా జరుగుతుంది అని, సైన్టిఫీగ్గా (వైజ్ఞానికంగా) తెలుసుకోండి. ఇన్ని లక్షలమంది ఈ భూమి మీద పుట్టారంటే, అది భయంకరమైనది కాదు. భయం అనవసరం. ఇంట్లో ఉన్న పెద్దలతోనో, అమ్మతోనో చర్చించండి.

బాగా నీళ్లు తాగండి:

Drinking Waterగర్భిణీలు ఎక్కువ నీళ్లు తాగితే, సహజమైన డెలివరీ సాధ్యం. శరీరానికి, నరాలకు సత్తువనిచ్చేది నీళ్ళే. సమస్య లేకుండా సహజమైన ప్రసవం జరగాలంటే, ప్రతి రోజు పళ్ళ రసాలు, మంచి నీళ్లు సంవృద్ధిగా తాగాలి. ఇలాంటి నియమాలతో పాటు, మీరు తీసుకునే ఆహారం కూడా సులభ ప్రసవం జరిగేందుకు తోడ్పడుతుంది.

సుఖ ప్రసవానికి సహకరించే ఆహారం ఆరోగ్యకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్దనివ్వగలదు. మరి ఆమె తినే ఆహారం మీదే ఆమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాం.

కూరలు, పళ్ళు:

నార్మల్ డెలివరీతాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.

ఐరన్ ఉన్న ఆహారం:

నార్మల్ డెలివరీగర్భిణులకు ఎక్కువ ఐరన్ అవసరము. సంవృద్ధిగా ఐరన్ ఉండే ఆహారం తినాలి. సులభంగా జీర్ణమయ్యే మాంసం, ఆకుకూరలు తినవచ్చు. చేపలవంటి జలచరాలు తింటే మంచిదే.

కొన్ని రకమైన పళ్ళు:

నార్మల్ డెలివరీపళ్ళల్లో కొన్ని యోని భాగాన్ని సాగడానికి సహకరిస్తాయి. బ్రోమిలియాన్ బాగా ఉండే పదార్ధాలు తినాలి. ఉదాహరణకి మామిడి పండు,అనాస అంటే పైనాపిల్ పండు వంటివి. ఇవి మరీ మోతాదు మించి అతిగా మాత్రం తినకూడదు.

మరి కారం తినవచ్చా:

శరీరం లో వేడినిచ్చేది కారం, ఒక రకంగా మంచిదే. కానీ ఎక్కువ తింటే, అసిడిటీ, అజీర్ణం, విరోచనాలు కలిగే ప్రమాదం ఉంది.

నార్మల్ డెలివరీకొన్ని ఆహార నియమాలు:

చెక్కెర తగ్గిస్తే మంచిది, రెటీనోల్ ఉన్నఆహారం పనికి రాదు. అలాగే, వీధుల్లో బండి మీద అమ్మే తినుబండారాలు అస్సలు తినకండి. రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు కదలకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. మీ పనులు చేసుకుంటూ, స్వల్ప వ్యాయామం చేస్తే మీ ప్రసవం సులభమవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR