బ్లాక్ ఫంగస్ నుండి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

కరోనా తగ్గుతున్న వారిలో దడ పుట్టిస్తున్న వ్యాధి బ్లాక్‌ ఫంగస్‌. వ్యాధి పాతదే అయినప్పటికీ ప్రస్తుతం కరోనా రోగుల్లోనే కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, చికెన్కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్ల్లో ఈమధ్య వైరల్అవుతోంది.

బ్లాక్‌ ఫంగస్‌అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించింది. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని స్ఫస్టత ఇచ్చారు.

బ్లాక్‌ ఫంగస్‌వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్య‌మాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. కానీ దాని వలన బ్లాక్ ఫంగస్ వస్తుంది అనడంలో వాస్తవం లేదు.

బ్లాక్‌ ఫంగస్‌ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలో చేరుస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కరోనా రోగుల్లో వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ అత్యవసర చికిత్స పరిధిలోకి వస్తున్నందున దానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగానే అంటువ్యాధుల జాబితాలో చేర్చినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. అంతేకాని నిజానికి బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధి కాదంటున్నారు నిమ్స్‌ పల్మనాలజిస్టులు.

బ్లాక్‌ ఫంగస్‌మ్యూకోర్మైకోసిస్‌ అనేది రెండు రకాలు. 1. రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యూకోర్మైకోసిస్‌. 2. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌. రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యుకోర్మైకోసిస్‌ అనే ఫంగస్‌ ముక్కు, కన్ను, మెదడుపై సోకుతుంది. ఇది ప్రస్తుతం కరోనా రోగుల్లో అధికంగా కనిపిస్తున్నది. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ అనేది ఊపిరితిత్తులకు సోకుతుంది. అంతేకాకుండా కిడ్నీలపై కూడా ఈ ఫంగస్‌ ఏర్పడుతుంది.

బ్లాక్‌ ఫంగస్‌ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా స్టెరాయిడ్స్‌ వాడకూడదు. ఆయాసం ఉంటే వైద్యుల పర్యవేక్షణలోనే స్టెరాయిడ్స్‌ వాడాలి. వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లకు ఉండే గొట్టాలు వంటివి హాస్పిటల్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

బ్లాక్‌ ఫంగస్‌కోలుకున్న తరువాత కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తినాలి. వేడి వేడి ఆహారాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆసుపత్రుల్లో కూడా కరోనా రోగులు చికిత్స పొందే ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చూడాలి. గోడలకు, గదుల్లో బూజు, దుమ్ము ధూళి లేకుండా చూడాలి.

బ్లాక్‌ ఫంగస్‌అసలు బ్లాక్‌ ఫంగస్‌ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు. అయినా దీనిని ప్రారంభదశలో గుర్తిస్తేనే 98 శాతం రికవరీ ఉంటుంది. ముక్కు దిబ్బడ, ముక్కులో నుంచి నల్లటి లేదా గోధుమ రంగు స్రవాలు కారడం, చెంపల వద్ద నొప్పి, తలనొప్పి, కంటి నొప్పి, కండ్లు వాయడం, చూపు మందగించడం వంటి లక్షణాలుంటే అది రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యుకోర్మైకోసిస్‌. తెమడతో కూడిన దగ్గు, తెమడతోపాటు రక్తం పడటం, రక్తపు వాంతు కావడం వంటి లక్షణాలుంటే అది పల్మనరీ అని అర్థం చేసుకోవాలి. మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి. దీనిని సీటీ స్కాన్‌, ఎమ్మారై-పీఎన్‌ఎస్‌ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు అంటే దగ్గు, తెమడతోపాటు రక్తం వస్తే ముందుగా టీబీ పరీక్ష చేయించాలి. ఎందుకంటే టీబీ లక్షణాలు, పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అది నెగెటివ్‌ వస్తే అప్పుడు చెస్ట్‌ సీటీ స్కాన్‌ చేయించాలి.

బ్లాక్‌ ఫంగస్‌ఈ బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా ఉండేందుకు ముందస్తు చికిత్స అంటూ ఏదీ లేదు. కాబట్టి బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన రోగులకు వెంటనే ‘అంపటరిసిన్‌’ ఇంజెక్షన్‌ ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినకూడదు. బ్లాక్ ఫంగస్ రాకపోయినా అలాంటి ఆహరం ప్రమాదకరం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR