Thirumalaki tholigadapaga cheppey devuni kadapa kshetram meeku thelusa?

0
7436

తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఏడు కొండల పైన వెలసిన ఆ వెంకన్న స్వామి ఆలయానికి తొలి గడపగా ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయం ప్రసిద్ధి చెందింది. మరి తిరుమలకి తొలిగడపగా చెప్పే ఆ దేవుని కడప క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ క్షేత్రానికి దేవుని కడప అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. thirumalaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, జిల్లా కేంద్రమైన కడపలో ఒక భాగములో ఉన్న దేవుని కడపలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాలయం ఉన్నది. ఈ ఆలయంలో వెంకటేశ్వరస్వామిని కృష్ణాచార్యులు ప్రతిష్టించారని ప్రతీతి. అందువలన ఈ నగరానికి కృషాపురమని పేరు వచ్చింది. ఈ కృషాపురమే రాను రాను కడపగా మారినట్లు తెలుస్తుంది. thirumalaతాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామివారిని సేవించి, కడప రాయుడిని తన కీర్తనలతో కీర్తించాడు. అంతేకాకుండా ఈయన ఈ దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామి మీద 12 కీర్తనలని వ్రాసాడు.thirumalaఇక ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఒక ఆచార్యుడు చాలా సార్లు తిరుపతి స్వామిని దర్శిస్తూ ఎప్పుడు ఆ స్వామినే స్మరించి కాలం గడుపుతుండేవాడు. ఆ తరువాత ముసలివాడు కావడంతో తిరుపతి వెళ్లలేక స్వామిని ప్రార్ధించగా, ఆ దేవదేవుడు ఆ భక్తునికి దర్శనం ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆ స్వామి వెళ్లిపోతుండగా ఆ భక్తులు స్వామివారి పాదాలు వదలకుండా అలానే పట్టుకొనిఉన్నాడు. అప్పుడు ఆ స్వామి భక్త ఇంకా ఏం కావాలి అని అడగగా, అప్పుడు ఆ ముసలి వాడు, స్వామి మీరు ఇచటనే ఉండి, మా పూజలను అందుకోండి. ఇక్కడ నాలాంటి భక్తులు చాలా మంది ఉన్నారని వేసుకోవడంతో, ఆ దేవుడు కడపలోనే శ్రీ లక్ష్మీవేంకటేశ్వరుడై వెలిసాడు. thirumalaదేవుని కడప క్షేత్రం తిరుమలకి తొలిగడపగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి, తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లేవారికి కదిపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడు చోట్లకి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరుడిని, శ్రీ సొమెహ్శ్వరస్వామిని దర్శించించుకొని దర్శించుకొని తరువాత ఈ మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలిగడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. thirumalaఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, శ్రీ వేంకటేశ్వరుని దేవేరి అయినా బీబీ నాంచారమ్మ ముస్లింల ఆడపడుచు కావడం వలన ఈ ఆలయానికి ముస్లింలు కూడా వస్తారు. ప్రత్యేకంగా ఉగాది పర్వదినాన ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుంటారు.6 thirumalaki tholigadapaga cheppe devuni kadapa kshetram miku telusa