కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఆహారం తప్పనిసరి

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ ప్రతి ఒక్కరికి సోకుతుంది. దీంతో దేశంలో రోజుకీ నాలుగు లక్షల వరకు కేసులు నమోదవుతుండగా.. వేలాది సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా వచ్చిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే సందేహాలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి. అయితే కోవిడ్ బారిన పడినప్పుడు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని హానికరమైన ఆహారాలను కూడా దూరం పెట్టాలి. కరోనా రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంధాం.

This diet is essential to combat the corona effectivelyరోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

This diet is essential to combat the corona effectivelyశ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఎ దోహదపడుతుంది. ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం ద్వారా ఈ పోషకాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

This diet is essential to combat the corona effectivelyకొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవచ్చు.

బాగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి.

నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు కూడా ఉంటాయి.

రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినండి. రాగి లేదా ఓట్స్‌లో ఫైబర్, విటమిన్-B, సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి.

This diet is essential to combat the corona effectivelyకరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తినండి. కిచిడీలో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు మీకు బలాన్ని అందిస్తాయి. పైగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.

This diet is essential to combat the corona effectivelyనీళ్లు ఎక్కువగా తాగండి. హైడ్రేషన్ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకోడానికి ఉపయోగపడుతుంది. నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్ఎష్, కొబ్బరి నీరు, హెర్పల్ టీలు తీసుకోండి.

This diet is essential to combat the corona effectivelyబటర్ మిల్క్ (మజ్జిగ) కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది.

జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి సులభంగానే ఉంటాయి. కానీ, ఇవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి.

This diet is essential to combat the corona effectivelyఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్నే తీసుకోండి. పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో తప్పకుండా ఉండాలి.

పాలకూర, టమాట, బీట్ రూట్ ఎక్కువగా తీసుకోండి.

మీకు డయాబెటీస్ లేదా గుండె తదితర సమస్యలు ఉంటే వైద్యుల సూచన ప్రకారం ఆహారం తీసుకోవాలి.

This diet is essential to combat the corona effectivelyబీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.

ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటివి) ఉండాలి.

రోజూ కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి.

పుల్లని నిమ్మ పండు, బత్తాయి తినాలి. వీటిలో వ్యాధిని అడ్డుకునే C విటమిన్ ఉంటుంది. అది వైరస్ నుంచి కాపాడుతుంది.

This diet is essential to combat the corona effectivelyఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

ఇంట్లో వండేవే తినాలి. క్రొవ్వు పదార్థాలు. నూనెల వాడకం తగ్గించాలి.

పండ్లు, కూరగాయల్ని బాగా కడిగి తినాలి.

వెన్న తీసిన పాలు, పెరుగు తినాలి. వాటిలో ప్రోటీన్, కాల్షియం బాగా ఉంటుంది.

This diet is essential to combat the corona effectivelyమన ఒంట్లో రోగ నిరోధక యంత్రాంగాన్ని పటిష్ఠంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. కరోనాను కట్టడి చేయడానికే కాదు. ఇతరాత్ర ఆరోగ్య సమస్యల్ని దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా సామాజికంగానూ పరిశుభ్రతను పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలి. అప్పుడే మహమ్మారి కరోనాను మనం కట్టడి చేయగలం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR