కంచె…..ఈరోజు ఒక మనిషిని ఇంకో మనిషిని వేరు చేసే విషయం ఏదైనా ఉంది అంటే అది కంచె. కానీ ఆ కంచె కి రూపాలు ఉన్నాయి…కులం, మతం, ప్రాంతం, మనుషులు వారి మధ్య అంతర్యాలు, రాగ ద్వేషాలు ఆఖరికి ఒక మనిషి రంగుని బట్టి కూడా వీడు మనోడు…వీడు మనోడు కాదు అని అంటున్నారు కానీ మనమంతే మనుషులమే…మనది అంత ఒకే జాతి…అన్న ఒక చిన్న నిజాన్ని అందరు ఎప్పుడో పక్కన పెట్టి రేపటి కొసం, మనలో మనమే కొట్టుకుని చస్తున్నాం, చంపుకుంటున్నాం అనే ఒక జగమెరిగిన సత్యాన్ని…కంచె అనే సినిమా ద్వారా అద్భుతంగా చెప్పారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.
అయన రాసుకున్నా కథ,కథనం, పాత్రలు ఏంత గట్టిగ ఉన్నాయో…అందుకు తగ్గ సంభాషణలతో ‘సాయి మాధవ్ బుర్ర’ గారు తన పెన్నుకీ ప్రాణం పోసి రాసిన సంభాషణలు కూడా అలానే ఉన్నాయి ఈ చిత్రంలో. అస్సలు సినిమా చూస్తున్నంత సేపు మన బ్రతుకులను మనకే చెప్తున్నట్టు ఉంటుంది..ఆ పాత్రలు, ఆ పాత్రలు చెప్పే డైలాగులు…
కంచె అనే సినిమా అప్పుడే కాదు ఈరోజుకి…రేపటికి,…ఎప్పటికి..మన అందరికి ఒక కనువిప్పు…ఈ చిత్రం ఒక చిత్రం గానే కాకుండా…మనలోని కులమత బేధాలను, మన ప్రేమలను-రాగ ద్వేషాలను ఎప్పటికి ప్రశ్నిస్తుంది…జవాబుని కూడా ఇస్తుంది.